బీరసాగులో అనువైన విత్తన రకాలు.. నాటే పద్థతులు

-

తీగజాతి కూరగాయల్లో.. బీరకాయ కూడా ఒకటి. పాలు పోసి వండితే బీరకాయ కూడా సూపర్ టేస్ట్ వస్తుంది. రైతుల కూడా బీరసాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మంచి దిగుబడి పొందవచ్చు. ఈరోజు మనం బీరసాగుకు అనువైన వాతారవరణ, నేలలు, విత్తన రకాలు చూద్దాం.
తేమతో కూడిన వేడి వాతావరణం బీరసాగుకు అనుకూలం. ఉష్ణోగ్రత 25-30 సెం.ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది. తీగ మొదటి పెరుగుదల దశలో వేడి ఎక్కువగా ఉంటే మగపూలు ఎక్కువగా వస్తాయి.

అనువైన నేలలు..

నీటిని నిలువుకునే తేలికపాటి ఎర్ర గరప బంకమట్టి నేలలు, ఉదజని సూచిక 6.0-7.0 మధ్య ఉన్న నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల ఒండ్రు నేలలు అనుకూలం.

విత్తన రకాలు:

జగిత్యాల లాంగ్‌: ఇది తెలంగాణాలోని కరీంనగర్‌ జిల్లాకు చెందిన దేశవాలీ రకం విత్తనం… కాయలు 50-60 సెంమీ. పొడవుతో నన్నగా, లోతైన కణుపులు కలిగి ఉంటాయి. ఖరీఫ్‌లో అధిక దిగుబడినిస్తుంది. వేనవిలోని అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు.
మిక.యం-1 : తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెరియాకుళం నుండి విడుదలయిన రకం, కాయలు, 60-70 సెం.మీ. పొడవుతో, కాయ చివర వెడల్పుగాను, తొడిమ భాగం సన్నగాను ఉంటుంది. పంటకాలం 130రోజులు, దిగుబడి 7టన్నులు ఉంటుంది.
కో-1: ఇది తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబతూరు నుండి విడుదలయిన రకం. తీగ పెరుగుదల మధ్యస్థంగా ఉంటుంది. కాయలు 40-50 సెం.మీ. పొడవుండి, కాయమీద కణుపులు ఎత్తుగా ఉంటాయి. కాయ పూత చివర భాగం వెడ్డల్పుగాను, కాయ తొడిమ భాగం సన్నగానూ ఉంటుంది. ఒక్కో కాయ 800 గ్రా. తూగుతుంది. పంటకాలం 125 రోజులు, దిగుబడి 6టన్నులు వరకూ వస్తుంది.
కో-2; ఇది కూదా తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబతూరు నుండి విడుదలయిన రకం. ఈ రకం కాయలు చాలా పొడవుగా ఉంటాయి. 90-160 సెం.మీ. వరకు ఉంటాయి. గింజలు కో-1లో కంటే తక్కువగా ఉంటాయి. ఒక్కో కాయ 700-800 గ్రా. బరువుంటుంది. వంటకాలం 120 రోజులు, దిగుబడి 10 టన్నులు వస్తుంది.
పూసానన్‌దర్‌: ఇది మధ్యప్రదేశ్‌ నుండి ఎన్నిక చేసిన రకం, ఈ విత్తనం త్వరగా కాపుకు వస్తుంది. ఒక్కో తీగకు 15-20 కాయలు కాస్తాయి. కాయలు లేత అకువచ్చ రంగులోను, లోపలి గుజ్ఞ లేత వనుపు రంగులోను ఉంటుంది. ఈ రకం ఖరీఫ్‌కు, వేసవికి అనుకూలం. దిగుబడి 7టన్నులు వస్తుంది.
అర్భ సుజాత: ఇది త్వరగా కాపుకు వచ్చే ఐ.ఐ.హెచ్‌.ఆర్‌.54, పొడవు రకం, ఐ.ఐ. హెచ్‌ ఆర్‌.18 లను సంకర పరచి రూపొందించబడింది. మొదటి కాయ 13-15 కణుపుకు వస్తుంది. కాయ 50-కర్‌ సెం.మీ. పాడవుంటుంది. పంటకాలం 100 రోజులు. దిగుబడి: 21టన్నులు ఉంటుంది. ఈ రకం కొంత వరకు బూజు తెగులను తట్టుకుంటుంది.
సత్‌పుతియ : ఇది బీహారు రకం. ఈ రకంలో ద్విలింగ వుష్పాలుంటాయి. కాయలు గుత్తులుగా చిన్నవిగా కాస్తాయి. ఖరీఫ్‌, వేసవి కాలానికి ఈ రకం అనువైనది.
అర్భ నుమీత్‌: ఇది భారతీయ ఉద్యాన వరిశోధన సంస్థ, బెంగుళూరు నుండి విడుదలయిన రకం. తీగ పెరుగుదల మధ్యస్థంగా ఉంటుంది. 15వ కణుపుకు కాయ కాస్తుంది. కాయలు 25 సెం.మీ. మందం, 55 సెం.మీ. పొడవుతో ఉంటాయి. 52 రోజులలో మొదటి కోత వస్తుంది. ఒక్కో తీగకు 13-15 కాయలు వస్తాయి. ఒక్కో కాయ 380గ్రా. బరువుంటుంది. పంటకాలం 120 రోజులు, దిగుబడి 20టన్నులు ఉంటుంది.
ఇవి కాక వివిధ ప్రైవేట్‌ హైబ్రిడ్‌ రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సురేఖా, సంజీవని, ఎన్‌.ఎస్‌.3,ఎన్‌.ఎస్‌.401, ఎన్‌.ఎస్‌.403, మహిమ రకాలు వేసవికి కూడా ఇవి అనువైన హైబ్రిడ్‌ రకాలు.

విత్తేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 6-8 టన్నుల చొప్పున వేసి కలియదున్నాలి. 60-40 సెం.మీ. దూరంతో కాలువలు వేసుకోవాలి. రెండు కాలువల మధ్య దూరం 20 మీ ఉండేటట్లు చూడాలి.
ఇమిదాక్షోప్రడ్‌ 5గ్రా. కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత టైకోదెర్మ విరిడే 4గ్రా. కిలో విత్తనానికి లేదా ఒక కిలో విత్తనానికి 3గా. థైరమ్‌ లేదా కాష్టాన్‌ పాదే మందు కలిపి విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.
రెండు పాదులు మధ్య దూరం వరాశ్రాలంలో అయితే 75 సెం.మీ. వేసవి పంటకయితే 50 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
ఒక్కో పాదుకు 3-5 గింజలను 1-2 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. విత్తిన 8-10రోజులకు మొలకెత్తుతాయి.
బలమైన 2 మొక్కలను ఉంచి మిగిలిన వాటిని జాగ్రత్తగా తీసివేయాలి.
ఒక వేళ ఖరీఫ్‌లో త్వరగా పంట వేయాలంటే మే నెలలోనే పాలిథిన్‌ సంచులలో గింజలను విత్తుకొని, రెండు ఆకుల దశలో పొలంలో నాటుకోవాలి. నాటేటప్పుడు, జాగ్రత్తగా పాలిథిన్‌ సంచులను తీసి, మట్టి గడ్డ ఏ మాత్రం చెదరకుండా గుంతలో పెట్టి మన్ను కప్పాలి. ఈ విధంగా చేస్తే మొక్కలు త్వరగా నిలదొక్కుకొని, బాగా పెరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version