దేశంలోనే 5 అత్యంత భయంకరమైన, విషపూరితమైన పాములు ఇవే..!

-

దేశంలో పాముకాటు మరణాలు రేటు అధికంగానే ఉంది. ముఖ్యంగా రైతులే వీటికి బలవుతున్నారు. మీకు తెలుసా..ఒక్క పాము 60 మందిని చంపగలదని. ఏటా ఐదు వేల మంది బాధితులు పాముకాటును చవిచూస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సైతం పాముకాటుకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ..అది విషంలేని పాము. ఈరోజు మనం అత్యంత విషపూరితమైన పాములకు గురించి తెలుసుకుందాం. అయితే..సున్నితమనస్సు గలవారు..పాములంటే భయపేవాళ్లు ఈ కథనాన్ని చదవకపోవటమే మంచింది.

కింగ్ కోబ్రా

కింగ్‌ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము.. ఈ పాము కాటుకు గురైన అరగంటలో ఎవరైనా చనిపోవచ్చు భారతదేశంలో మరణానికి అత్యంత సాధారణ కారణం కింగ్ కోబ్రా కాటు. కింగ్ కోబ్రా శరీరం కార్డియోటాక్సిన్, సినోప్టిక్ న్యూరోటాక్సిన్‌లను కలిగి ఉంటుంది. కాటు తర్వాత, శరీరం చాలా ముఖ్యమైన ప్రక్రియ న్యూరో సిస్టంపై కింగ్ కోబ్రా చాలా సీరియస్‌గా ప్రభావితం చూపుతుంది.

ఇండియన్ క్రైట్

అత్యంత విషపూరితమైన పాములలో ఇదీ ఒకటిగా పరిగణిస్తారు. ఒకసారి కాటు వేస్తే ఒకేసారి 60 – 70 మందిని చంపేస్తుంది. ఇది ముఖం, తలపై దాడి చేస్తుంది. ఈ పాము కాటు వల్ల ఎటువంటి నొప్పి ఉండదు. దాంతో కనీసం పాము కాటు వేసిందని కూడా గ్రహించలేరు.

ఇండియన్ కోబ్రా

చాలా విషపూరితమైనది భారతదేశంలో, ఈ పామును నాగుపాము అని పిలుస్తారు. దీన్ని హిందూ గ్రంథాల్లో విశేషంగా పూజిస్తారు. ఈ పాము భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో తరచుగా కనిపిస్తుంది. ఈ పాము కాటుకు ప్రజలు బతకలేరు. వయోజన పాము 1 మీ నుండి 1.5 మీ (3.3 అడుగుల 4.9 అడుగులు) వరకు ఎత్తులో ఉంటుంది.

రస్సెల్ వైపర్

భారతదేశంలోని వేడి రాష్ట్రాలలో కనిపించే ఈ పాము చాలా కోపంతో, మెరుపు వేగంతో దాడి చేస్తుంది. అయితే, ఈ పాము భారతీయ క్రేట్ కంటే ఎక్కువ విషపూరితమైనది కాదు. ఈ విషసర్పం ప్రతి సంవత్సరం 20,000 మందిని చంపుతుందని ఓ డేటా చెప్తుంది.

ఈ సా స్కేల్డ్ వైపర్

ఈ పాము పొడవు చాలా తక్కువగా ఉంటుంది, కానీ చాలా యాక్టివ్, డైనమిక్, దూకుడుగా ఉంటుంది. ఇది కాటు వేస్తే, పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ పాము కాటు వల్ల ఏడాదికి 5,000 మంది చనిపోతున్నారని తేలింది. ఇది చాలా విషపూరితమైన పాము.

విషపూరితమైన పామా నార్మల్‌ పామా అనేది కాదు..పాము ఏదైనా..డేంజరే..పాము కాటుకు గురైన వెంటనే ప్రథమ చికిత్స అనంతరం..వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యాలు అన్ని వేళలా మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version