కుంకుమ పువ్వు ఎందుకంత ఖరీదు..నిజంగా రంగును మార్చేస్తుందా..?

-

కుంకుమపువ్వు అంటే ఏంటో..అది ఎందుకు ఉపయోగడపడుతుందో అందరికీ తెలుసు..దాని గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. అయితే అసలు గర్భిణులు కుంకుమపువ్వు తింటే..నిజంగానే బిడ్డ తెల్లగా పుడతాడా..? అసలు ఇందులో ఎంతవరకూ నిజముందే కూడా ఆలోచించకుండా.. అంత ఖరీదైనప్పటికీ కొని వాడేస్తారు..! ఈరోజు ఈ కుంకుమపువ్వు ఎందుకంత కాస్ట్‌ ఉంటుంది, ఇది తీసుకుంటే బిడ్డ నిజంగానే తెల్లగా పుడతాడా అనేది చూద్దాం..!

ఎందుకంత ఖరీదు

ఎక్కడ పడితే అక్కడ కుంకుమ పూల మొక్కలు పెరగవు. ఇది కాశ్మీర్లోని పాంపోర్ అనే చిన్న పట్టణంలోనే అధికంగా పెరుగుతందట… అది కూడా కేవలం శరదృతువు కాలంలోనే పెరుగుతుంది..ఒక పువ్వులో కేవలం మూడు రేకలు మాత్రమే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఏరి వాటి రంగు, రుచిని కాపాడేందుకు ఎండ బెడతారు. అరకిలో కుంకుమ పూల రేకలు కావాలంటే కనీసం 75 వేల పూవులు కావాలి…అందుకే కుంకుమ పూలు చాలా ఖరీదు.
కుంకుమ పూలలో కూడా పుషల్, సర్గోల్, సూపర్ నెగిన్, నెగిన్ అనే నాలుగు రకాలు ఉన్నాయి. వీటిలో చవకైనది పుషల్ రకం. ఇది పసుపు, నారింజ రంగును కలిగి ఉంటుంది. దీనిలో ఔషధగుణాలు కూడా చాలా తక్కువ. ఇక అత్యంత ఖరీదైనది సూపర్ నెగిన్ రకం. ఇందులో ఔషధ విలువలు చాలా ఉంటాయి.

తెల్లగా అవుతారా..?

గర్భిణిలు కుంకుమ పూరేకులు తింటే పుట్టబోయే బిడ్డ తెల్లగా ఉంటుందని ఎన్నో ఏళ్లగా వస్తున్న నానుడి.. గర్భిణీగా ఉన్నప్పుడు కుంకుమ పూరేకులు తినడం మంచిదే. ఇందులోని ఔషధ గుణాలు కాబోయే తల్లికి, గర్భస్థ శిశువుకు చాలా అవసరం. కానీ ఇది రంగును నిర్ణయిస్తుందని మాత్రం శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదు. బిడ్డ రంగును నిర్ణయించేవి తల్లి, తండ్రి నుంచి వచ్చిన జన్యువులే. అయితే గర్భిణులు కుంకుమ పూల రేకలు తినడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది తల్లి శరీరాన్ని ప్రసవానికి సిద్ధం చేస్తుందట…అలాగే జలుబు, దగ్గును నియంత్రిస్తుంది. ఇలా ఆరోగ్య ప్రయోజనాలైతే కుంకుమ రేకలతో చాలా ఉన్నాయి. కానీ బిడ్డ రంగును పెంచుతుందని మాత్రం ఇంతవరకు ఏ పరిశోధనా నిరూపించలేదు.

కల్తీదీ కనిపెట్టాలంటే ఇలా చేసేయండి..

కల్తీ కుంకుమ పూలతో చాలా సమస్యలు వస్తాయి. మీరు కొన్న కుంకుమ పువ్వు మంచిదో, కల్తీదో తెలుసుకోవాలంటే మూడు రేకలను గ్లాసు నీటిలో వేయండి. కుంకుమ పువ్వు కరిగిపోకుండా అలాగే ఉంటే అది మంచిదని అర్థం. అలాగే కల్తీ కుంకుమపువ్వు నీటిలో వేసిన వెంటనే రంగుని విడిచి కరిగిపోతుంది. కానీ మంచి కుంకుమపువ్వు నీటిలో వేసిన వెంటనే రంగును విడవదు. కొన్ని సెకన్ల సమయాన్ని తీసుకుని అప్పుడు రంగును విడుదల చేస్తుంది.
మంచిది అని పైసల్‌ ఉన్నాయని డైలీ అధికంగా తీసుకుందాం అంటే అసలుకే ప్రమాదం.. చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. రోజుకు 1.5 గ్రాముల కుంకుమ పూరేకలు తింటే చాలు. అయిదు గ్రాముల కన్నా ఎక్కువ తింటే మాత్రం.. చాలా సమస్యలు వస్తాయి.. గర్భిణిలుకు అయితే గర్భస్రావం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు.. కాబట్టి వాడేవాళ్లు పరిమాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే..పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news