అర‌స‌విల్లిలో అద్భుతం..

-

  • మూడేళ్ల త‌ర్వాత ఆదిత్యుని తాకిన సూర్య కిర‌ణాలు

అమ‌రావ‌తి (అరసవిల్లి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్క్క‌తమైంది. మూడేళ్ల తర్వాత సూర్యకిరణాలు ఏడు నిమిషాల పాటు స్వామివారిని తాకాయి. ఆదిత్యుని పాదాలను స్పృశించేందుకు భానుడు చేసిన ప్రయత్నానికి గత మూడేళ్లుగా మేఘాలు అడ్డుపడుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉదయం 6 గంటల 6 నిమిషాల సమయంలో స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకు బంగారం ఛాయ లేలేత కిరణాలు తాకాయి. దీంతో భక్తులు ఆనందోత్సాహాలతో పరవశించారు. ఏటా ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో ఈ కిరణ స్పర్శ భాస్కరుడిని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా భక్తులను కనువిందు చేస్తోంది. ప్రతి సంవత్సరం మార్చి నెల 9, 10, అక్టోబరు 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాటును తాకుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version