ఈ మధ్య కాలంలో.. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగి పోయింది. ఎలాంటి పనులు చేసినా.. చిన్న వీడియో అయినా సరే.. తమ తమ సోషల్ మీడియాల్లో…పెడుతూ.. ఎక్కువ వ్యూస్ రాబట్టుకుంటున్నారు నెటిజన్లు. నెటిజన్ల తో పాటు.. చాలా మంది సామాన్యులు కూడా.. తమకు తోచిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా రామ్ సుభాగ్ యాదవ్ అనే నెటిజన్ తన ఫేస్ బుక్ లో ఓ పెళ్లికి సంబంధించిన వీడియో పోస్టు చేశాడు.
ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. అంతకాదు.. ఈ వీడియో ఒక్కరోజులోనే 2.3 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. ఏంటి ఈ వీడియో ఏం ఉందని అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే.. నార్త్ ఇండియాకు చెందిన ఓ జంటకు ఇటీవల వివాహం అయింది.
వివాహం అయిన అనంతరం.. వరుడు, వధువుకు ఇద్దరూ కలిసి స్వీట్లు తినిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. వరుడు ముఖం పై ఆ యువతి స్విట్ తో కొట్టింది. దీంతో ఆగ్రహించిన వరుడు ఆ స్వీట్లను ఆమెపైకి విసిరాడు. ఆ తర్వాత ఆమె చెంపపై కొట్టాడు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెజిటన్లు.. ఫన్నీగా ఫీల్ అవుతున్నారు.