మాటతూలిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్…. ఉక్రెయిన్లను ఇరానియన్లు అంటూ…

-

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. ఉక్రెయిన్- రష్యా సంక్షోభంపై మాట్లాడుతూ.. రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్లకు మద్దుతు ఇస్తున్నట్లు వెల్లడించారు. రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. రష్యా విమానాలపై నిషేధాన్ని విధించాడు. పుతిన్ ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవచ్చు కానీ.. ఉక్రెయిన్ ప్రజల మనసును గెలుపొందలేరంటూ.. వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే బైడెన్ ప్రసంగంలో మాట తూలారు. ఉక్రెయిన్లను, ఇరానియన్లుగా సంభోధించారు. పు తిన్ కైవ్‌ను ట్యాంకులతో చుట్టుముట్టవచ్చు, కానీ అతను ఇరాన్ ప్రజల హృదయాలను మరియు ఆత్మలను ఎప్పటికీ పొందలేడు” అని బిడెన్ తన స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో అన్నారు. బైడెన్ ఇలా మాట తూలడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది తన ఉపాధ్యక్షుడు కమలా హారిస్‌ను తప్పుగా “ప్రెసిడెంట్ హారిస్” అని పిలిచినప్పుడు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఇరానియన్ పదం ట్విట్టర్, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవడం ప్రారంభం అయింది.

79 ఏళ్ల బైడెన్ మాటలు తూలడం గతంలో కూడా జరిగేది. తన ప్రసంగంలో తరుచూ సమస్యలు ఎదుర్కొనేవాడు. చిన్నతనం నుంచి నత్తిగా మాట్లాడే వాడు. దీనిని అధిమించేందుకు బైడెన్ చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు యేట్స్, ఎమర్సన్ రచనలు చాలా ఉపయోగపడ్డాయని గతంలో వెల్లడించేవాడు.

Read more RELATED
Recommended to you

Latest news