క‌న్‌ఫ్యూజ్ అయిన బీజేపీ శ్రేణులు.. కిమ్ జోంగ్‌ను చైనా అధ్య‌క్షుడు అనుకున్నారు..

చైనా అధ్య‌క్షుడు ఎవ‌రు.. అంటే ఎవ‌రికైనా ఠ‌క్కున స‌మాధానం వ‌స్తుంది.. జిన్ పింగ్ అని.. కానీ ప‌శ్చిమ బెంగాల్‌లోని అస‌న్‌సోల్ అనే ప్రాంతానికి చెందిన బీజేపీ శ్రేణులు మాత్రం ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్‌ను చైనా అధ్య‌క్షుడు అనుకున్నారు. అంతేకాదు.. కిమ్ దిష్టిబొమ్మ‌కు శ‌వ‌యాత్ర నిర్వ‌హించి ద‌హ‌నం కూడా చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

bjp leaders confused kim jong as china president

భార‌త జ‌వాన్ల ప‌ట్ల చైనా ఆర్మీ చేసిన ప‌నిని ఏ భార‌తీయుడూ జీర్ణించుకోలేక‌పోతున్నాడు. అందుక‌నే చైనా వ‌స్తువుల‌ను వాడ‌కూడ‌ద‌ని నిర్ణయించుకుంటున్నారు. ఇక అనేక చోట్ల చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హ‌నం చేస్తున్నారు. అయితే ప‌శ్చిమ బెంగాల్‌లోని అస‌న్‌సోల్‌లో ఉన్న బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మాత్రం ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌ను చైనా అధ్య‌క్షుడు అనుకున్నారు. ఆ మేర‌కు వారు వీడియోలో మాట్లాడిన మాట‌ల‌ను కూడా మ‌నం విన‌వ‌చ్చు.

అయితే ఇందులో కామెడీ ఉన్నా.. నిజానికి వారి ఆందోళ‌న‌లో అర్థం ఉంది. కాక‌పోతే అది మిస్‌ఫైర్ అయింది. అంతే.. ఇందులో త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. వారు చైనా అధ్య‌క్షుడిగా కిమ్‌ను అనుకున్నా.. నిజానికి వారి ఉద్దేశం చైనాపై నిర‌స‌న తెల‌ప‌డ‌మే. కానీ ఈ విధంగా ప‌రిస్థితి మార‌డం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ వైర‌ల్ వీడియోకు కార‌ణ‌మైంది.