ఇది ఏ యుగమైనా కానీ.. మేం మాత్రం మారం.. మాకు కులమే తిండి పెడుతుంది. కులమే మాకు దాహం తీర్చుతుంది. కులమే మాకు అండ. ఆ కులం లేకుంటే మేం బతలకలేం.. అనేవాళ్లు చాలామంది ఉన్నారండోయ్. ఇప్పుడు మనం చదువుకోబోయే కథనం అదే.
మీరు ఏంట్లు(ఏంటోళ్లు).. ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా ఎదురైందా? చాలామందికి చాలాసార్లే ఎదురై ఉంటుంది. ఎక్కడికెళ్లినా.. ఈ అనవసరపు ప్రశ్నను చాలామంది అడుగుతుంటారు. ఏంటో.. కులం గురించి తెలుసుకొని ఏం చేస్తారో? కులం తిండి పెడుతుందా? దాహం తీర్చుతుందా? పేరు చివర కులం తోక ఎందుకు? ఈ సాంకేతిక యుగంలో కూడా ఇంకా కులం.. కులం అంటూ విర్రవీగడం ఎందుకు. నువ్వు తక్కువ కులం వాడివి.. నువ్వు ఎక్కువ కులం వాడివి… అంటూ ఇంకా తారతమ్యాలు ఎందుకు. ఏ కులమైనా నీ ఒంట్లో ప్రవహించేది రక్తమే కదా? అది ఎర్రగానే ఉంటుంది కదా.
ఇది ఏ యుగమైనా కానీ.. మేం మాత్రం మారం.. మాకు కులమే తిండి పెడుతుంది. కులమే మాకు దాహం తీర్చుతుంది. కులమే మాకు అండ. ఆ కులం లేకుంటే మేం బతలకలేం.. అనేవాళ్లు చాలామంది ఉన్నారండోయ్. ఇప్పుడు మనం చదువుకోబోయే కథనం అదే. పేరు చివర కులం లేదని తాళీయే కట్టకుండా వెళ్లిపోయాడు పెళ్లికొడుకు. చిత్రంగా ఉంది కదా. పదండి గుంటూరు వెళ్లొద్దాం..
గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో ఉన్న మల్లేశ్వరస్వామి గుడిలో పెళ్లి జరుగుతోంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ సిద్ధంగానే ఉన్నారు. పూజారి కూడా మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు. ఇంకొన్ని నిమిషాల్లో పెళ్లి కావాలి. కానీ.. సడెన్ గా పెళ్లి ఆగిపోయింది. ఎందుకంటే.. పెళ్లి కొడుకు తాళి కట్టకుండానే వెళ్లిపోయాడు. పెళ్లి కూతురు మెడలో తాళి కట్టనంటే కట్టనని మొండికేశాడు. ఎందుకు బాబు.. అని అడిగితే.. గుడిలో పెళ్లికి రిజిస్ట్రేషన్ చేసిన పేర్లలో అమ్మాయి, ఆమె తండ్రి పేరులో చివర రెడ్డి లేదట. వాళ్ల ఆధార్ కార్డులోనూ వాళ్ల పేరు చివర రెడ్డి లేదట. పేరు చివర రెడ్డి అనే పదం లేదని.. పెళ్లే క్యాన్సల్ చేసుకున్నాడు ఆ ప్రబుద్ధుడు. అంతే కాదు.. మీది రెడ్డి కులం కాదు. నన్నే మోసం చేస్తారా? రెడ్డీలు కాకుండా.. అబద్ధం చెప్పి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారా? అని అమ్మాయి తరుపు బంధువులను చెడామడా తిట్టేసి.. నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడట. దీంతో ఏం చేయాలో తెలియక… పెళ్లి కూతురు బంధువులు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.