నిశ్చితార్ధం ఆన్లైన్ లో చేసుకున్నారు, పెళ్లి ఏ విధంగా చేసుకుంటారో…!

కలియుగంలో ఎం జరుగుతుందో ఏమో గాని చూసే ప్రతీ ఒక్కటి వింతగానే ఉంటున్నాయి. సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న కొన్ని విషయాలు చూస్తే చాలా వరకు విడ్డూరంగానే ఉంటాయి. రాజకీయాల్లో, కుటుంబ, వ్యాపార, వ్యక్తిగత, విద్య ఇలాంటి వాటిల్లో కొన్ని కొన్ని సోషల్ మీడియాలో చాలా వరకు వింతగానే కనపడుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది.

ఆన్లైన్ లో ఒక నిశ్చితార్ధం చేసారు కొందరు పెద్దలు. అమ్మాయి, అబ్బాయి ఎక్కడ ఉంటారో తెలియదు గాని, అసలు ఈ వ్యవహారం ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు గాని, వీడియో చూస్తే అది ఉత్తరాది వ్యవహారం మాదిరిగా ఉంది. పెద్దలు ఇద్దరికీ పెళ్లి కుదిర్చారు. మరి విమానం టికెట్లు దొరకలేదో లేక రావడం కుధరలేదో తెలియదు గాని ఇద్దరికీ ఆన్లైన్ లో నిశ్చితార్ధం చేసారు. ఇద్దరికి చెరొక ఫోన్ లో వీడియో కాల్ చేసారు.

ఆ వీడియో కాల్ ముందు చీరలు, బట్టలు, పువ్వులు, వంటివి ముందు పెట్టారు. హిందుత్వ సాంప్రదాయం ప్రకారం చేసిన ఈ నిశ్చితార్దానికి వచ్చిన వారు ఫోన్ లో ఫోటోలు కూడా తీసుకుని సంతోష పడ్డారు మరి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. మరి పెళ్లి ఎలా చేసుకుంటారో చూడాలి. దీనిపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.