వింత: ఆర్డర్ చేసిన ఆహారంలో ఫ్రైడ్ చికెన్ కి బదులుగా డీప్ ఫ్రైడ్ టవల్..!

ఒక మహిళ టేక్ ఎవే ఆర్డర్ చేశారు. దానిలో ఫ్రైడ్ చికెన్ (Fried Chicken) కి బదులుగా డీప్ ఫ్రైడ్ టవల్ వుంది. నిజంగా ఇది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. Alique Perez ఫిలిప్పీన్స్ లో మంగళవారం నాడు ఫుడ్ ఆర్డర్ పెట్టారు.

ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత తన కొడుకుకి కొద్దిగా చికెన్ కట్ చేసి పెడుతుంటే ఒక వింత జరిగింది. ఆమె తన కొడుకు కోసం ఆర్డర్ చేసిన ఆ చికెన్ ని ఓపెన్ చేయగానే దానిలో డీప్ ఫ్రై చేసిన టవర్ వుంది.

చికెన్ కి బదులుగా టవల్ ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటి ఈ చికెన్ లో టవల్ వచ్చింది అని ఆమె కాస్త డిస్ట్రబ్ అయ్యారు. నిజంగా ఆహారంలో ఇంత వింత జరగడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

దీనితో ఆమె మొదట కోపం పడి ఆ తర్వాత కూల్ అయ్యారు. దీని కోసం రెస్టారెంట్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. రెస్టారెంట్ వాళ్ళు మేము జాగ్రత్త పడతాము దీనికి సంబంధించి మేము జాగ్రత్తగా ఉంటాం అని.. అదే విధంగా ఫుడ్ తయారు చేసిన వాళ్ళకి కూడా ఈ విషయం చెబుతామని వాళ్ళు ఉన్నారు.