పొట్టలో ఇరుక్కుపోయిన డీయొడ్రెంట్‌ బాటిల్‌.. తెలిసి కూడా లైట్‌ తీసుకున్న యువకుడు..కట్‌ చేస్తే…

-

పొట్టలో కాస్త ఇబ్బందిగా ఉంటేనే తట్టుకోలేం. మూత్రవిసర్జన డైలీ సాఫీగా జరిగితేనే హెల్తీగా ఉన్నట్లు..లేదంటే..మలబద్ధకం సమస్యతో లేనిపోని ఇబ్బంది. అలాంటిది ఓ వ్యక్తి 20 రోజులగా మల విసర్జనకు వెళ్లకుండా ఉండిపోయాడు. పైగా పొట్టలో డియోడ్రెంట్‌ బాటిల్‌ ఉండిపోయిందట. హైలెట్‌ ఏంటంటే.. పొట్టలో బాటిల్‌ ఉందని తెలిసి కూడా అతను వైద్యులను సంప్రదించలేదు.

ఆ యువకుడిది కోల్ కతా. వయసు 27 ఏళ్లు. ఆ బాటిల్ ఎందుకు పొట్టలోకి వెళ్లిందో, ఎవరు అలా చేశారో చెప్పడానికి ఆ యువకుడు నిరాకరించాడు. కాకపోతే పురీషనాళం ద్వారానే అది పొట్టలోకి చేరినట్టు చెప్పాడు. 20 రోజుల పాటూ ఆహారం సరిగా తినకుండా, మల విసర్జన చేయకుండా ఉండడంతో తీవ్రంగా పొత్తి కడుపులో నొప్పి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేసి ఆ బాటిల్‌ను బయటికి తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడిని వారం పాటూ అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యులు చెప్పారు.

దాదాపు ఏడున్నర అంగుళాల బాటిల్ మూతతో సహా పొట్టలో ఉంది. దాన్ని తీయడానికి వైద్యులు దాదాపు రెండు గంటల పాటూ ఆపరేషన్ చేశారు. దీని వల్ల ఆ యువకుడి అన్నవాహిక కూడా దెబ్బతింది. దీంతో దానికి కూడా సర్జరీ చేసి సరిచేశారు వైద్యులు. పేగులు దెబ్బతిన్నట్టు గుర్తించారు. కాకపోతే వాటికి ఇప్పడు సర్జరీ చేయలేదు. పేగులకు భవిష్యత్తులో సర్జరీ అవసరం అవుతుందంటున్నారు వైద్యులు.

పొట్టలో బాటిల్ ఉందని తెలిసి కూడా వెంటనే వైద్యుడిని సంప్రదించకపోవడం వల్లే అతడు సమస్యను పెరిగిపోయేలా చేసుకున్నాడని వైద్యులు తెలిపారు.. వెంటనే వెళ్లి ఉంటే పేగులు, అన్నవాహిక పాడవకుండా ఉండేవి. అతను ఇలాగే ఉంటే మరికొన్ని రోజుల్లో మరణించేవాడని అన్నారు.

పొట్టలో ఎమైనా ఇరుక్కుపోతే వెంటనే వైద్యులను సంప్రదించి తీయించుకోవాలి. అలా కాకుండా..మొండి ధైర్యంతో అలానే ఉంటేనే ప్రాణాల మీదకు వస్తుంది. పొట్ట చాలా సున్నితమైన ప్రాంతం, పొట్టలోని పేగుల్లో సమస్య మొదలైతే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news