ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి ఉండే ఈ విచిత్ర‌మైన ఫోబియాల‌(భ‌యాల‌) గురించి తెలుసా..?

-

హీలియో ఫోబియా ఉన్న‌వారికి సూర్యుడు అన్నా లేదా కాంతివంతంగా క‌నిపించే వ‌స్తువులు అన్నా, కాంతి అన్నా భ‌యం ఉంటుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌నుషుల్లో కొంద‌రికి కొన్ని ర‌కాల భ‌యాలు ఉంటాయి. మ‌రికొంద‌రికి మ‌రికొన్ని ర‌కాల భ‌యాలుంటాయి. కొంద‌రికి దెయ్యాలు అంటే భ‌యం ఉంటే.. కొంద‌రికి ఎత్తైన ప్ర‌దేశాలు అంటే భ‌యం పుడుతుంది. అలాగే ఇంకొంద‌రు స‌ముద్రంలో ఉన్న నీరును చూడాలంటే భ‌య‌ప‌డ‌తారు. ఇలా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌నుషులు చాలా మందికి అనేక ర‌కాల ఫోబియాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల ఫోబియాలు మాత్రం కొంద‌రికి స‌హ‌జంగానే ఉంటాయి. అవి కామ‌న్‌.. కానీ కింద తెలిపిన ఫోబియాలు కూడా కొంత‌మందికి ఉంటాయి. నిజానికి అవి చాలా వింతైన ఫోబియాలు.. మ‌రి ఆ ఫోబియాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. హీలియో ఫోబియా

ఈ ఫోబియా ఉన్న‌వారికి సూర్యుడు అన్నా లేదా కాంతివంతంగా క‌నిపించే వ‌స్తువులు అన్నా, కాంతి అన్నా భ‌యం ఉంటుంది. నిజంగా వింత‌గా ఉంది క‌దా. అయినా ఈ ఫోబియా ఉండేవారు కూడా ప్ర‌పంచంలో ఏదో ఒక మూల‌న ఉంటార‌ట‌.

2. ల‌కానోఫోబియా

ఈ ఫోబియా ఉన్న‌వారికి కూర‌గాయ‌లు అంటే భ‌యం ఉంటుంది. దీంతో వారు కూర‌గాయ‌ల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. భ‌య‌ప‌డ‌తారు.

3. హ‌ఫే ఫోబియా

ఈ భ‌యం ఉన్న‌వారు ఇత‌రుల‌ను ట‌చ్ చేయ‌డానికి కూడా భ‌య‌ప‌డుతార‌ట‌. ఎందుకంటే.. ఇత‌రుల‌ను ట‌చ్ చేస్తే వారి చేతుల‌కు ఉన్న విష ప‌దార్థాలు త‌మ‌కు అంటుతాయోమోన‌ని, లేదా ఏవైనా అంటు వ్యాధులు వ‌స్తాయేమోన‌ని భ‌య‌ప‌డుతారు. అందుకే ఈ ఫోబియా ఉన్న‌వారు సాధార‌ణంగా ఇత‌రుల‌ను ట‌చ్ చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌రు.

4. కౌల్రో ఫోబియా

ఈ ఫోబియా ఉన్న‌వారికి జోక‌ర్లు అంటే భ‌యం ఉంటుంది. ఎంత‌లా అంటే.. జోక‌ర్ క్యారెక్ట‌ర్లు క‌నిపించినా.. వారు భ‌య‌ప‌డిపోతారు.

5. నియో ఫోబియా

ఈ భ‌యం ఉన్న‌వారు కొత్త వ‌స్తువులు, కొత్త మ‌నుషులు, కొత్త విష‌యాలు.. ఏవైనా స‌రే.. కొత్త అంటే.. భ‌యప‌డుతారు. నిజంగా ఈ ఫోబియా భ‌లే విచిత్రంగా ఉంది క‌దా..!

6. ట్యురో ఫోబియా

ఈ ఫోబియా ఉన్న‌వారు చీజ్ అంటే భ‌య‌ప‌డ‌తారు. చీజ్ తినేందుకు ఆస‌క్తి చూప‌రు. ఆందోళ‌న చెందుతారు.

7. జెఫిరోఫోబియా

ఈ ఫోబియా ఉన్న‌వారికి ఎత్తైన బ్రిడ్జిలు అంటే భ‌యం ఉంటుంది. వాటిని ఎక్కేందుకు భ‌య ప‌డ‌తారు.

8. అసెండోఫోబియా

ఈ భ‌యం ఉన్న‌వారు ఎస్క‌లేట‌ర్ మెట్లు, లిఫ్ట్ లేదా సాధార‌ణ మెట్ల‌పై ఎక్క‌డానికి జంకుతారు. ఆ విధంగా చేయ‌డం వారికి న‌చ్చదు. ఆందోళ‌న చెందుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version