ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడని కుక్క, యజమానికి చుక్కలు చూపించింది…!

-

కుక్కలు మనకు మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. మన జీవితాల్లో వాటికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాటి అందమైన చేష్టలు, అవి చేసే పనులతో మనకు ఎప్పుడు దగ్గరవుతునే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంది. ఇండియా టుడే తన సోషల్ మీడియా ఖాతాలో దీనికి సంబంధించిన ఒక వీడియో ని పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో ఒక మొండి కుక్క రోడ్డు మీద పడి ఉంది, దాని యజమాని పలుమార్లు దాని తాడు లాగినప్పటికీ కదలడానికి నిరాకరించింది. రోడ్డు మీద అలాగే పడుకుంది. “మీరు ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడనప్పుడు, మీ యజమాని పట్టుబడితే” అనే క్యాప్షన్‌తో ఇండియా టుడే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. యజమాని నిరంతర౦గా చేసిన ప్రయత్నాల తర్వాతే కుక్క చివరకు లేచింది.

వీడియో వేగంగా వైరల్ అవుతోంది. యజమాని మరియు కుక్క రెండూ షికారుకి వెళ్లినట్టు కనపడుతుంది. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో దానికి ఎంత మాత్రం ఇష్టపడని కుక్క అలాగే పడుకుని పోయింది. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుక్కలు మనుషుల దగ్గర ఎంత గారాబం ప్రధర్శిస్తాయో అనడానికి ఈ వీడియో ఉదాహరణ అంటున్నారు నెటిజన్లు.

ttps://www.instagram.com/p/B733EQtHXnf/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Read more RELATED
Recommended to you

Latest news