పింక్ రీమేక్ లో పవన్ లుక్ లీక్…??

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. రెండేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసిలో నటించిన పవన్, ఆ తరువాత తన జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నం అయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాకు యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పింక్ అనే కోర్ట్ డ్రామా మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నారు.

ఇకపొతే దాదాపుగా రెండేళ్ల తరువాత పవన్ తన ముఖానికి మేకప్ వేసుకోవడంతో ఆయన లేటెస్ట్ లుక్ లో ఎలా ఉన్నారో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఉవ్విళ్లూరుతున్నారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకతను పవన్ కు సంబందించిన లేటెస్ట్ పిక్ ఒకటి సొంతగా క్రియేట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయగా, పలువురు పవన్ ఫ్యాన్స్ దానిని విపరీతంగా షేర్స్ లైక్స్ చేస్తూ మరింత వైరల్ చేసారు. అయితే చివరకు ఆ పిక్ ని చూసిన ప్రముఖ సంగీత దర్శకుడు థమన్, సూపర్ బ్రదర్,

 

నేను కూడా మీలానే పవన్ గారి లుక్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆ ఫ్యాన్ మెడ్ పిక్ ని రీట్వీట్ చేయడం జరిగింది.
ఇక తొలిసారిగా థమన్ ఆ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ మూవీ కి పని చేస్తున్నారు. ఎప్పటినుండో పవన్ గారి మూవీ కి మ్యూజిక్ అందించాలనే కల ఎట్టకేలకు తీరినందుకు ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా ఆయన ఫ్యాన్స్ ఎంతో గొప్పగా చెప్పుకునేలా ఇందులో సాంగ్స్ కంపోజ్ చేస్తానని ఇటీవల థమన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం….!!

Read more RELATED
Recommended to you

Latest news