మనుషులకే కాదు.. కుక్కలకు కూడా పార్క్ ఉందండోయ్..!

-

మనుషులకే కాదు కుక్కలకు కూడా పార్కులొచ్చాయండోయ్. కుక్కలకు పార్కులేంది. అయినా.. అవి పార్కులకు పోయి ఏం చేస్తాయి అని అంటారా? మనుషులు పార్కులకు పోయి ఏం చేస్తారో.. అవి కూడా అవే చేస్తాయి. మనుషులు సాధారణంగా ఎందుకు పార్కులకు వెళ్తారు.. సేద తీరడం కోసం.. ప్రశాంతంగా కొంత సేపు గడపడం కోసం వెళ్తుంటారు. పెంపుడు కుక్కలను కూడా కాసేపు ఆడించడానికి.. వాటితో ప్రశాంతంగా గడపడానికే ఈ పార్క్ అన్నమాట. ఈ పార్క్ ఎక్కడో లేదు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్క్ ప్రారంభమయింది. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఫ్రీగా ఈ పార్క్ లో పెట్ డాగ్స్ ను తీసుకెళ్లి ఉల్లాసంగా గడిపి రావచ్చు. బాగుంది కదా ఐడియా.

Read more RELATED
Recommended to you

Exit mobile version