పురాతన కాలం లో మమ్మీలు ఉన్నాయని మనం వైన్ ఉంటాం. అయితే దానికి సంబంధించి కాస్త ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకి వచ్చింది. రీసెర్చర్లు పరిశీలించగా అక్కడ ఎక్స్రే మొదలైన కంప్యూటర్ టెస్ట్ ద్వారా మొదట మగ పూజారి అనుకున్నారు. కానీ కాదు అని తరువాత తేలింది. అక్కడ ఉన్న ఆ మమ్మీ ఒక గర్భవతి అని కనుగొన్నారు.
గురువారం నాడు మొట్టమొదటిసారి గర్భవతి అయిన మహిళ పురాతన మమ్మీ అని కనుగొనడం జరిగింది. కోఫిన్ మీద male priest అని రాశారు కానీ అది నిజం కాదు. అయితే తరువాత అతను మగ వ్యక్తి కాదు అని గర్భవతి అయిన మహిళ అని తేలింది. ఎలా ఈ విషయం తెలిసింది అనే విషయానికి వస్తే..
మొదట మమ్మీకి పురుషాంగాలు లేవు. అదే విధంగా పొడవైన జుట్టు, స్తనముల ఆధారంగా మహిళ అని గుర్తించారు. ఇది ఇలా ఉంటే ఆమె గర్భవతి అయిన మహిళ అని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. చిన్న పాదం, చిన్న చేతులు ఫీటస్ లో ఉండడం గుర్తించారు అని ఆర్కియాలజిస్టు చెప్పారు.
ఆమె వయసు 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయి. కడుపులో ఉండే బిడ్డ ఆధారంగా 26 నుండి 28 వారాల గర్భవతి అని తెలుస్తోంది. నిజంగా ఇది ఎంతో పెద్ద సర్ప్రైస్ అని వాళ్లు అన్నారు. నేషనల్ మ్యూజియం ఈ విషయాన్ని జర్నల్ ఆఫ్ ఆర్కియాలజీ సైన్స్ లో పబ్లిష్ చేయడం జరిగింది.