కువైట్‌లో ఉన్న వెంకటలక్ష్మి ఆచూకీ తెలియకపోవడంతో అక్కడ ఉన్న ఆమె స్నేహితులు ఆమె చనిపోయి ఉంటుందని భావించి అదే విషయాన్ని ఇండియాలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు.
మన కుటుంబ సభ్యుల్లో మనం ఎంతగానో ప్రేమించే ఒకరు చనిపోతే మనకు ఎంత బాధ కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పుడు కలిగే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అయినా మనం చేసేదేమీ ఉండదు కదా. కొన్ని రోజుల పాటు బాధ పడతాం. తరువాత ఆ విషయాన్ని మనం మరిచిపోయి, మన పనులు మనం చేసుకుంటాం. అయితే ఆ కుటుంబం కూడా సరిగ్గా ఇలాగే అనుకుంది. తమ మధ్య అప్పటి వరకు ఉన్న ఆమె చనిపోయిందని తెలిసి వారు బాధ పడ్డారు. కర్మకాండ కూడా చేయించారు. కానీ 2 ఏళ్ల తరువాత ఆ యువతి బతికొచ్చింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కె.గంగవరం మండలం దంగేరు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి 3 ఏళ్ల కిందట బతుకు దెరువు నిమిత్తం కువైట్ దేశానికి వెళ్లింది. అయితే అక్కడ ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు. అయితే ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆమె వివరాలు తెలుసుకోవడం అందరికీ కష్టమైంది.
అయితే కువైట్‌లో ఉన్న వెంకటలక్ష్మి ఆచూకీ తెలియకపోవడంతో అక్కడ ఉన్న ఆమె స్నేహితులు ఆమె చనిపోయి ఉంటుందని భావించి అదే విషయాన్ని ఇండియాలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె మృతదేహం లేకుండానే అంత్యక్రియలు, కర్మకాండ నిర్వహించారు. అయితే ఈ మధ్యే వెంకటలక్ష్మి కోమా నుంచి బయట పడడంతో ఆమె తన వివరాలను తెలపగా, కువైట్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం వారు ఆమెకు పాస్‌పోర్టు అరేంజ్ చేసి తమ ఖర్చులతో ఓ నర్సును తోడిచ్చి వెంకటలక్ష్మిని స్వదేశానికి పంపించారు. దీంతో చనిపోయిందనుకున్న తమ కూతురు తిరిగి వచ్చే సరికి ఆ తల్లిదండ్రులు, ఆమె భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఆ కుటుంబ సభ్యుల అదృష్టం, ప్రేమే వెంకటలక్ష్మిని తిరిగి వారి వద్దకు చేర్చాయని చెప్పడంలో ఎలాంటి అతియోశక్తి లేదు కదా..!