చూడ్డానికి అచ్చం రష్మికలా ఉన్న మాజీ క్రికెటర్‌

-

మనుషలను పోలిన మనుషులు ఉంటారని మనం ఇప్పటికీ నమ్ముతుంటాం. ఏ సంబంధం లేకుండానే అచ్చం మన పోలీకలతో వేరే వాళ్లు ఉంటారంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది కదూ..! నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నలా మరో సెలబ్రెటీ ఉంది తెలుసా..? హైలెట్‌ ఏంటంటే.. ఇక్కడ ఇద్దరూ పాపులరే. పుష్ప మూవీతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఎదిగిన రష్మికలా ఉన్న మరో స్టార్‌ పేరు సనా మీర్‌. ఆమె క్రికెట్‌ మీజా కెప్టెన్.

పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్. సనా మీర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరుపున 14 సంవత్సరాల పాటు ఆడి, అత్యుత్తమ క్రికెటర్‌గా పేరు తెచ్చుకుంది. తన క్రికెట్ కెరీర్‌లో ఆఫ్ స్పిన్నర్‌గా అసాధారణ ఆటతీరును ప్రదర్శించింది. ఆమె 226 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడింది. అందులో 137 మ్యాచ్‌లలో తనే జట్టుకు కెప్టెన్‌. వన్డేలలో 100 వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ మహిళా బౌలర్‌ తను. 2018లో, ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి పాకిస్తానీ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది.

2010, 2014 ఆసియా క్రీడలలో పాకిస్తాన్‌కు రెండు బంగారు పతకాలను సాధించింది. 240 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. 2009-2017 వరకు పాకిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా సారధ్యం వహించింది. సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు మే 2020లో రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా చేస్తున్నారు. 37 ఏళ్ల సనా మీర్, క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలా మంది క్రికెట్ అభిమానులు ఆమె క్యూట్ లుక్స్‌కు పడిపోయారు. తను చూసేందుకు రష్మికలా ఉండటంతో ఇప్పుడు రష్మిక ఫ్యాన్స్‌ అంతా తనను కూడా లైక్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news