గోరుముచ్చుకు ఏలూరు సీటు… బీసీలతో వైసీపీకి చెక్?

-

ఏలూరు అంటే టిడిపి కంచుకోట. ఏలూరు పార్లమెంట్ ఏర్పడినప్పటి నుండి ఒకటి రెండు సార్లు తప్ప ప్రతిసారి టిడిపినే గెలుచుకుంది. అంటే ఏలూరులో టిడిపి పట్టు ఏంటో మనం అంచనా వేయవచ్చు. ఇప్పటివరకు మాగంటి బాబు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. కానీ ఇప్పుడు అనారోగ్య కారణాల వల్ల, వ్యక్తిగత కారణాలవల్ల మాగంటి బాబు కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన యాక్టివ్ గా ఉన్నా సరే..వయసు మీద పడటం వల్ల..ఆయనకు సీటు ఇచ్చే అవకాశాలు లేవు.

అయితే ఏలూరులో మొదట నుంచి టీడీపీ ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వారిని ఎక్కువ నిలబడుతూ వచ్చింది. గతంలో 2019లో వైసిపి వెలమ సామాజిక వర్గానికి చెందిన కోటగిరి శ్రీధర్ ను  మాగంటి బాబు పై పోటీగా నిలబెట్టి విజయాన్ని సాధించింది. ఈసారి ఎన్నికలలో టిడిపి ఏలూరులో ఒక ప్రయోగం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఏలూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా గోరుముచ్చు గోపాలరావు యాదవ్‌ను నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు ఎంపీ టికెట్ రేసులో మాగంటి బాబుతో పాటు చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గంటా మురళి ఇలా పలువురు ఉన్నారు.

అయితే గోరుముచ్చు ఏలూరు ఎంపీ టికెట్ ని ఆశించి గత నాలుగు నెలలుగా ఏలూరు పరిధిలో విస్తృతంగా సేవా కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గోపాలరావు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి .  ఏలూరు పార్లమెంట్ పరిధిలో యాదవ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే గోరుముచ్చు పలుమార్లు టిడిపి నేత చంద్రబాబు నాయుడును కలిసి ఏలూరు పార్లమెంట్ టికెట్ కోరినట్లు తెలిసింది. ఇక ఆర్ధిక పరంగా కూడా గోరుముచ్చు బలమైన నేత కావడంతో బాబు..గోరుముచ్చు వైపు చూస్తున్నట్లు తెలిసింది.

ప్రజారాజ్యం సమయంలో 2009 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డియ్య యాదవ్ పెద్దగా ప్రచారం చేయకుండానే లోకల్ కాకపోయినా రెండు లక్షల పైనే ఓట్లు సాధించాడు.  అవన్నీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లే అని టిడిపి అంచనా వేస్తోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఏలూరు ఎంపీ స్థానానికి బీసీ సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెట్టి ప్రయోగాత్మకమైన గెలుపును సొంతం చేసుకోవాలని టిడిపి ఆలోచిస్తుంది. టిడిపి ప్రయోగం ఫలిస్తుందో లేదో వేచి చూడాల్సిందే

Read more RELATED
Recommended to you

Latest news