మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే.. రహదారిపై వాహనంలో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఆపితే అన్ని డాక్యుమెంట్లు ఉంటే సరే. లేదంటే వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇక ద్విచక్ర వాహనదారులైతే ధృవ పత్రాలు లేకపోతే ముందు ట్రాఫిక్ పోలీసులు ఉంటే అట్నుంచి అటే పరార్ అవుతారు. ఇది ఎక్కడైనా సహజంగా జరిగేదే. కానీ హైదరాబాద్ ఆబిడ్స్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ట్రాఫిక్ పోలీసులు ఎదురుగా ఉన్నారని తెలిసినా ఓ యువతి రాంగ్ రూట్‌లో వెళ్లి అడ్డంగా దొరికిపోయింది. తరువాత ఏమైందంటే…
అబిడ్స్ రోడ్డు లో రాంగ్ రూటులో టూవీలర్ పై వెళుతున్న యువతిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. లైసెన్స్ చూపించమని పోలీసులు కోరగా.. లైసెన్స్ లేదని, కేసు నమోదు చేసుకోమని యువతి హల్ చల్ చేసింది. ఈ క్రమంలో ఓ దశలో ఆ యువతి పోలీసులను తోసుకొని వెళ్ళడానికి ప్రయతించడంతో ట్రాఫిక్ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఆ యువతి తన వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్ళింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.
అయితే ఆ యువతి అలా పోలీసులకు దొరకడం, వారితో వాగ్వివాదానికి దిగడాన్ని ఎవరో మొబైల్‌లో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ యువతి వీడియో కాస్తా ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. కావాలంటే మీరు ఆ వీడియోను చూడవచ్చు.