హైడ్ అండ్ సీక్ ఆడుతూ వాషింగ్ మెషిన్ లో ఇరుక్కుపోయిన అమ్మాయి…!

-

కొంత మంది చేష్టలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. లాక్ డౌన్ సమయంలో ఇప్పుడు జనాలకు ఇంట్లో ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి. దీనితో ఇంట్లోనే వినోదానికి మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఇలా చేసే ఒక అమ్మాయి వాషింగ్ మెషిన్ లో ఇరుక్కుపోయింది. 18 ఏళ్ల అమరి డాన్సీ తన బంధువులతో కలిసి సరదాగా ఆడుకుంటూ వాషింగ్ మెషిన్ లో దాక్కుంది.

అందరూ కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారు. ఆమె బంధువులలో ఒకరు ఆమె మెషిన్ లో చిక్కుకున్నట్లు గుర్తించి ఇతరులకు చెప్పడం తో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోలో, ముసుగులు ధరించిన అగ్నిమాపక సిబ్బంది బృందం బాలికను రక్షిస్తుంది. మెషిన్ పైభాగాన్ని తీసివేసి, అమ్మాయిని బయటకు తీసేందుకు నానా కష్టాలు పడ్డారు.

“వారు నన్ను బయటకు తీస్తారా లేదా అని నాకు నిజంగా భయమేసింది. వారు అసలు ఎం చేస్తారు అనేది నాకు అర్ధం కాలేదు. నేను అక్కడి నుంచి ఎలా అయినా సరే బయటపడాలి అనుకున్నా అని ఆమె వివరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎలాంటి గాయాలు కాకుండా ఆమెను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news