తల మీద విష సర్పాన్ని పెట్టుకుని 11 కిలోమీటర్లు వెళ్ళాడు…!

పాము… దాన్ని చూస్తే సగం గుండెలు జారిపోతాయి చాలా మందికి. ఆ పేరు వింటే చాలా ప్రాణం అరచేతిలోకి వచ్చి బతుకు జీవుడా అంటూ పక్కకు తప్పుకుంటారు. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా పాముని తలలో పెట్టుకుని 11 కిలోమీటర్లు ప్రయాణం చేసాడు. అవును ఈ ఘటన కేరళలో జరిగింది. సాధారణంగా పాములు అంటే ఎక్కడ ఉంటాయి…? ఎక్కడో పుట్టల్లోనో, మన కర్మ కాలితే బైక్ బ్యాగ్స్ లో, బాత్ రూమ్స్ లో ఉంటాయి.

కార్లు, ఏసీలు అంటూ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. కాని ఒక పాము ఏకంగా హెల్మెట్ లో ఉండిపోయింది. కేరళని తిరువనంతపురంలో ఒక ఉపాధ్యాయుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కేరళలోని కందానాద్ సెయింట్ మేరీ హైస్కూల్‌లో టీచర్ గా పని చేస్తున్నాడు రంజిత్. తన ద్విచక్ర వాహనంపై స్కూల్ కి బయల్దేరాడు. దాదాపు తన ఇంటి వద్ద నుంచి అరగంట పాటు ప్రయాణం చేసి వెళ్ళాడు స్కూల్ కి.

ఎప్పటి మాదిరిగానే హెల్మెట్ పెట్టుకున్నాడు. స్కూల్ కి వెళ్ళిన తర్వాత హెల్మెట్ తీసాడు. ఈ సమయంలో తలకు ఏదో తగిలినట్టు గుర్తించాడు. కదిలేది ఏదో ఉన్ధనుకున్నాడు. వెంటనే దాన్ని పరిశీలనగా చూడగా అది ఒక పాము. అయితే అది చనిపోయి ఉంది. హెల్మెట్ పెట్టుకోవడం వలన చనిపోయిందా లేక అసలు ఎవరైనా తనను భయపెట్టడానికి పెట్టారా అనేది అతనికి అర్ధం కాలేదు. వెంటనే ఆస్పత్రికి వెళ్ళగా అతనికి ఏమీ కాలేదని ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.