సోషల్ మీడియా పుణ్యమాని తమలోని టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసి రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఆంధ్రాకు చెందిన బేబీ కూడా తన గాత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సింగర్ గా సెటిల్ అయింది. అలాగే.. ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా అంతే. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. డ్యాన్సింగ్ అంకుల్ కూడా తన వైవిధ్యమైన డ్యాన్స్ తో సెలబ్రిటీ అయిపోయాడు.
ఇప్పుడు రను మొండల్ వంతు. తన గాత్రం వింటే మీరు మరో లోకంలోకి వెళ్లిపోతారు. అంత మధురంగా ఉంటుంది తన వాయిస్. లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నగ్మా హే పాటను పాడి ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది రను. ఆమె గురించి తెలుసుకున్న ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ హిమేష్ రెష్మియా తన తదుపరి సినిమా హ్యాపీ హార్డీ అండ్ హీర్ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకు సంబంధించి ఓ పాటను ఆమెతో పాడించాడు. ఆమె పాడుతుండగా.. వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు హిమేష్. ఆ వీడియోను చూసిన నెటిజన్లు మరోసారి ఆమె వాయిస్ కు ఫిదా అయిపోయారు. లతా మంగేష్కర్ వాయిస్ నే మైమరిపించేలా ఉంది ఆమె వాయిస్.
ఎప్పుడైనా నీ జీవితంలోకి టాలెంట్ ఉన్న వ్యక్తి ప్రవేశిస్తే వాళ్లను వదిలేయకు. వాళ్లలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి తెలిసేలా కృషి చేయు.. అంటూ సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ అంకుల్ నాతో ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అందుకే నేను.. రనులో ఉన్న టాలెంట్ కు ఫిదా అయిపోయి.. తనకు సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చానని హిమేష్ తెలిపాడు.
View this post on Instagram