మూడు మిలియన్‌ సంవత్సరాల నుంచి ఆ ఊరిలో అస్సలు వర్షమే పడలేదట..!!

-

ఈ భూ ప్రపంచంలో వర్షం పడని నేల ఒకటి ఉందా? ఆఖరికి ఎడారిలో కూడా వర్షం పడి నీళ్ళు ఉండనే ఉంటాయి. వర్షం పడని ప్రాంతం ఒకటి ఉంది అంటే అస్సలు నమ్మబుద్ది కావడం లేదు కదా.. కానీ ఇది అక్షరాల నిజం..ఇక ఆలస్యం లేకుండా ఆ ఊరు ఎక్కడ ఉంది.. మనుషులు ఉన్నారా.. లేదా..అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

చిలీలోని అటకామా ఎడారిలో కలామా అనే పట్టణంలో ఇప్పటి వరకు చినుకు కురిసిన దాఖలాలే లేవు..ఆ ఊరిలో లక్షా ఇరవై వేల సంవత్సరాలుగా నదులన్నీ ఎండిపోయి ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మూడు మిలియన్‌ సంవత్సరాల కంటే ముందు నుంచే అటకామా ప్రాంతం ఎడారిగా ఉంది. ఈ ప్రాంతం భూమిపై అత్యంత పురాతన ఎడారిగా గుర్తింపు పొందింది…

అటకామా ఎడారి దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఈ ఎడారిలో వర్షం దాదాపు శూన్యం. దక్షిణ అమెరకా పశ్చిమాన,పసిఫిక్ మహాసముద్రం తీరంలో యాండీస్ పర్వత శ్రేణి పశ్చిమాన ఉన్న సన్నని భూభాగంలో ఉన్న ఈ ఎడారి 1000 కి.మీ. (600మైళ్ళు) పొడవున విస్తరించి ఉంది. నాసా మరికొన్ని ప్రచురణల ప్రకారం అటకామా ఎడారి ప్రపంచంలో అత్యంత పొడి ఎడారి..ఉత్తర చిలీలో విస్తరించి ఉన్నఈ ఎడారి వైశాల్యం 181,300 చదరపు కిలోమీటర్లు ఇందులో ఆధిక భాగం ఉప్పు బేసిన్‌లు, ఇసుక, లావా రాళ్ళు…అయితే అంత పెద్ద ఎడారిలో మనుషులు ఉండటం సాధ్యం కాదు..జనసంచారం లేదని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news