బెడిసికొట్టిన ప్రీ వెడ్డింగ్ షూట్.. లిప్ కిస్ ఇచ్చుకుంటూ.. వీడియో

-

వాళ్లు లిప్ కిస్ ఇచ్చుకుంటూ నీళ్లలో పడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వాళ్లే ఆ వీడియోను తమ ఫేస్ బుక్ పేజీలో పెట్టారు.

ఇది టెక్నాలజీ యుగం బాస్. ఈ జనరేషన్ కు ఏదైనా దాచుకునే అలవాటు. అవి మెమోరీస్ అయినా ఏవైనా. తమ జీవితంలో ఒకేసారి వచ్చే కొన్ని మెమోరీస్ ను దాచుకోవడం కోసం నేటి జనరేషన్ ఎంత దూరమైనా వెళ్తారు. ముఖ్యంగా మనిషి జీవితంలో ఒకేసారి సంభవించే పెళ్లి కావచ్చు. ఇంకేదైనా కావచ్చు. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. అందుకే.. ఆ ఆనంద సమయాలను కెమెరాల్లో బంధిస్తారు. ఇప్పుటి తరం పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ చేస్తోంది. పెళ్లికి ముందు రకరకాల పోజులో ఫోటోలు దిగి వాటిని పెళ్లి కోసం వాడుకుంటారన్నమాట.

అయితే.. ప్రీ వెడ్డింగ్ షూట్ కు బాగా ఫేమస్ అయిన కేరళలో ఓ విచిత్రం చోటు చేసుకున్నది. ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహిస్తున్నారు. నదిలో షూట్ జరుగుతోంది. పడవలో కూర్చున్న జంటను ఫోటోషూట్ తీస్తున్నారు. ఆ జంట పడవలో రకరకాల పోజులు ఇస్తున్నారు. చివరకు లిప్ కిస్ ఇచ్చుకోబోయారు. వాళ్లు లిప్ కిస్ ఇచ్చుకుంటుండగా ఫోటో తీయాలన్నమాట. అయితే.. వాళ్లు లిప్ కిస్ మోజులో పడి ఒకేవైపు ఒరిగే సరికి.. పడవ బ్యాలెన్స్ తప్పి బోల్తా పడింది. దీంతో లిప్ కిస్ ఇచ్చుకుంటున్న ఆ జంట నీళ్లలో పడిపోయారు. అదృష్టవశాత్తు అక్కడ లోతు తక్కువగా ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఇంకేమన్నా ఉందా?



వాళ్లు లిప్ కిస్ ఇచ్చుకుంటూ నీళ్లలో పడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వాళ్లే ఆ వీడియోను తమ ఫేస్ బుక్ పేజీలో పెట్టారు. అయితే…. ఏదో సరదాకు వాళ్లు సోషల్ మీడియాలో వీడియో పెడితే ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version