మరో నిర్భయ.. ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం… ఆపై హత్య

-

రాయ్ చూర్ పోలీసుల తీరు కూడా చాలా విచిత్రంగా ఉందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సగం కాలి ఉన్న మనిషి ఎలా ఉరివేసుకుంటారు.. అని ప్రశ్నిస్తున్నారు. మధు కుటుంబ సభ్యులు కూడా ఇది ఆత్మహత్య కాదు.. హత్యేనని చెబుతున్నారు.

మీకు నిర్భయ గుర్తుందా? ఢిల్లీలో జరిగిన ఆ ఘటన అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. ఎంతలా అంటే నిర్భయ చట్టం కూడా వచ్చింది. మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్లకు నిర్భయ చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉన్నాయి. నిర్భయ చట్టం తర్వాత ఆడవాళ్లపై దాడులు ఆగుతాయనుకున్నారు. ఆ చట్టం ఎంత పటిష్టంగా ఉన్నా… నిర్భయ లాంటి ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా కర్ణాటకలో నిర్భయ తరహా ఘటన ఒకటి చోటు చేసుకున్నది. మధు అనే ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. మధు మృతి ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. రాయ్ చూర్ లో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న మధు మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె ఉరి వేసుకొని ఉన్నట్టుగా పోలీసులకు కనిపించింది.

అయితే ఆమెను సగం కాల్చేసి ఆ తర్వాత ఉరేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారంగానే జరిగిందని తెలుస్తోంది. ఆమెను కిడ్నాప్ చేసి రేప్ చేసి ఆమె చంపేసి… సగం కాల్చేసి ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ఎవరికీ డౌట్ రాకుండా చెట్టుకు ఉరేశారు.

ఆమె చదివే కాలేజీకి సమీపంలోనే ఆమె మృతదేహం లభించడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. కాలిన స్థితిలో ఉరేసుకొని ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు. అయితే.. తనకు బ్యాక్ లాగ్స్ ఉన్న కారణంగా మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా మధు రాసిన ఓ సూసైడ్ నోట్ అక్కడ పోలీసులకు దొరికింది. కానీ.. అదంతా నిందితులు కావాలని సృష్టించిన లెటర్ గా అనుమానిస్తున్నారు.

అయితే.. రాయ్ చూర్ పోలీసుల తీరు కూడా చాలా విచిత్రంగా ఉందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సగం కాలి ఉన్న మనిషి ఎలా ఉరివేసుకుంటారు.. అని ప్రశ్నిస్తున్నారు. మధు కుటుంబ సభ్యులు కూడా ఇది ఆత్మహత్య కాదు.. హత్యేనని చెబుతున్నారు. మధుకు బ్యాక్ లాగ్స్ లేవని వాళ్లు అంటున్నారు. మధును ఎవరో రేప్ చేసి కావాలని ఆత్మహత్యగా సృష్టించారని మధు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే.. సోషల్ మీడియాలో మధుకు మద్దతుగా కొంతమంది పోరాటం సాగిస్తున్నారు. #JusticeForMadhu పేరుతో హాష్ టాగ్ ను క్రియేట్ చేసి తనకు న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తున్నారు. మధు హంతకులను వెంటనే పట్టుకొని వాళ్లకు కఠిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్లకు కఠినంగా శిక్ష పడితేనే మధు ఆత్మ శాంతిస్తుందని వాళ్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version