కెమిస్ట్రీ పెళ్లి పత్రికను చూశారా ఎప్పుడైనా?

-

Kerala Couple's Wedding Card Goes Viral

ఏంది.. కెమిస్ట్రీ పెళ్లి పత్రికా? ఇంకా నయం.. ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, హిస్టరీ పెళ్లి పత్రికలు కూడా ఉంటాయని చెప్పలేదు అంటారా? నిజమండి బాబు.. ఓ జంట వినూత్నంగా తమ పెళ్లికి కెమిస్ట్రీ పెళ్లి పత్రికను అచ్చు వేయించింది. ఇదిగో.. మీరు పైన చూస్తున్నారు కదా ఫోటో. అది వాళ్ల పెళ్లి పత్రికలో ఓ భాగం. కెమిస్ట్రీ తెలిసిన వాళ్లకయితే ఈజీగా అర్థం అవుతుంది. కేరళకు చెందిన సూర్య వితున్ నాయర్ అనే యువతి ప్లాన్‌కు ప్రతిరూపమే ఈ వినూత్న పెళ్లి పత్రిక.


ఆమె కెమిస్ట్రీ టీచర్. అందుకే.. తన పెళ్లి పత్రికను కూడా కొత్తగా.. తనకు తెలిసిన కెమిస్ట్రీని ఉపయోగించి అచ్చేయించి ఆ కార్డును తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. అనుకోకుండా ఆ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడం, దాన్ని కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ చూడడం.. దాన్ని షేర్ చేసి కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పడం ఓవర్‌నైట్‌లో జరిగిపోయాయి. దీంతో ఆ జంట పెళ్లి కాస్త నెటిజన్లు ముచ్చటించుకునేలా అయింది.

https://www.facebook.com/soorya.nair.98/posts/10205415266258868
https://twitter.com/ShashiTharoor/status/1073161890623311872?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1073161890623311872&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational-news-telugu%2Fkerala-couple-wedding-card-goes-viral-1-1-584420.html

Read more RELATED
Recommended to you

Exit mobile version