తల్లి ప్రేమ అంటే ఇది, ప్రాణాలకు తెగించిన పక్షి… వైరల్ వీడియో…!

-

తల్లి ప్రేమ… ఈ భూమి మీద దానికి మించిన విలువైనది లేదు. తన పిల్లలను కాపాడుకోవడానికి ఒక తల్లి పడే తపన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది జంతువు అయినా, పక్షి అయినా, మానవుడైనా, తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఒక తల్లి తన పిల్లలను కాపాడుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఇదే విషయం స్పష్టతమవుతుంది.

ఒక పొలంలో తల్లి పక్షి తన గుడ్లు కాపాడుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది. వివరాల్లోకి వెళితే ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన “మేము మాట్లాడుతున్న వీడియో, “అదే # తల్లుల ప్రేమ. తల్లి #బర్డ్ తన గుడ్లు పొలంలో ఉన్నందున కదలకూడదని నిర్ణయించుకుంది. ఆమె నేలమీద నిలబడింది. రైతు ప్రత్యేకంగా తీసుకోవలసి వచ్చింది.

తన యంత్రాన్ని జాగ్రత్తగా తీసుకు వెళ్ళారు. ఇది మిమ్మల్ని ఉత్సాహ పరుస్తుంది.” 43 సెకన్ల క్లిప్ ఒక పొలంలో కూర్చున్న పక్షి తన గుడ్లను కాపాడుతుండగా ఒక యంత్రం దాని దిశలో ముందుకు కదులుతుంది. యంత్రం దగ్గరకు వచ్చేసరికి, పక్షి తన గుడ్లకు మరింత రక్షణ కల్పిస్తుంది మరియు గుడ్ల చుట్టూ తన ఈకలతో రక్షణ కవచం చేయడానికి కూడా ప్రయత్నిస్తుంది. యంత్రం వస్తున్నా సరే పక్షిలో ఎలాంటి భయం ఉండదు.. తన పిల్లలను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త పడుతుంది. దీనితో రైతు కూడా ఆ ప్రేమకు తల వంచాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version