గర్ల్ ఫ్రెండ్ ను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టాడు..!

-

గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మధ్య కోపాలు, తాపాలు సహజమే కదా. అవును.. సహజమే కానీ.. ఈ బాయ్ ఫ్రెండ్ దాన్ని అసహజంగా తీసుకున్నాడు. ఎంతలా అంటే.. తన గర్ల్ ఫ్రెండ్ ను ఈబేలో అమ్మకానికి పెట్టే అంత. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా.. అవును.. ఈ ఘటన యూకేలో చోటు చేసుకున్నది.

డేల్, కెల్లీ ఇద్దరు లవర్స్. ఓరోజు ఇద్దరు కలిసి షాపింగ్ కు వెళ్లారు. అప్పుడు ఇద్దరి మధ్య చిన్న గొడవ అయింది. దీంతో డేల్ కు కోపం వచ్చింది. కోపంతో ఏం చేయాలో తెలియక.. తన గర్ల్ ఫ్రెండ్ ను ఈబేలో అమ్మకానికి పెట్టాడు. కెల్లీ ఫోటోను అప్ లోడ్ చేసి వేలం వేశాడు. దీంతో ఆ వేలానికి మంచి డిమాండ్ పెరిగింది. చాలా మంది కెల్లీ మీద పాట పాడారు. మొత్తం వంద దాకా బిడ్లు రావడం విశేషం. ఒకరైతే ఏకంగా ఆమె కోసం రూ.68 లక్షలు ఇస్తానంటూ బిడ్ వేశాడు.

అయితే.. ఇదంతా మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ.. ప్రాక్టికల్ గా వర్కవుట్ కాదు కదా. ఎందుకంటే కెల్లీ బొమ్మ కాదు మనిషి కదా. అయితే.. ఈ వేలం సంగతిని ఆలస్యంగా గుర్తించిన ఈబే ఆ ప్రకటనను అందులో నుంచి తొలగించింది. తర్వాత.. తన బాయ్ ఫ్రెండ్ తనను అమ్మకానికి పెట్టాడని తెలుసుకున్న కెల్లీ కూడా అతడిని ఏమనలేదట. ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version