బ్రహ్మచారులా…అయితే ఫైన్  కట్టండి…!!!

-

ఇదేంటి ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా..?? బ్రహ్మచారులు పన్ను కట్టడం ఏమిటి..?? రకరకాల పన్నుల గురించి విన్నాం ఇదెక్కడి పన్ను..?? ఇలా అయితే ఎలా అంటూ ఓ మధన పడిపోకండి. అసలు పన్నులు అనేవి పూర్వం నుంచీ వస్తున్నవే , కాలానికి అనుగుణంగా ఆ పన్నులలో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి చట్టాలు, పన్నులతో పోల్చుకుంటే మనం ఎంతో అద్రుష్టవంతులమనే చెప్పాలి. ఎందుకంటే పూర్వం బ్రిటీష్ హాయంలో మనం ఉప్పుకి కూడా పన్ను కట్టిన విషయం విధితమే.

సరే అసలు బ్రహ్మచారులకి పన్ను ఏమిటి, ఏంది ఈ కధ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే బ్రహ్మచారులకి కూడా పన్ను ఉండేదట. క్రీస్తు పూర్వం రోమ్ చక్రవర్తుల కాలంలో అగస్టన్ అనే చక్రవర్తి బ్రహ్మచారులపై కూడా పన్నులు విధించే వాడట. వివాహం చేసుకోకుండా ఉండే యువకుల వలెనే అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వారు మృగాలుగా మారుతున్నారు అంటూ వివాహం చేసుకొని వారిపై పన్నులు విధించే వారట.


ఈ పరిమామలతో అప్పట్లో బ్రహ్మచారులు పెళ్లిళ్ళు చేసుకునే వారని చరిత్ర చెబుతోంది. వివాహం చేసుకునేవారే సమాజంలో భాద్యతగా మెలుగుతారని ఆయన భావించేవాడట. అంతేకాదు ప్రతీ పౌరుడు భాద్యతగా మెలగాలని పలురకాల పన్నులు వేసేవాడట ఆ రోమ్ చక్రవర్తి  అగస్టన్ మరి ఇప్పుడు అలాంటి పన్నులు వేస్తే ప్రభుత్వ ఖజానా భారీగా పెరిగి అవకాశం ఉంటుందేమో….

Read more RELATED
Recommended to you

Latest news