మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకు హితేశ్ తో కలిసి వైసీపీలో చేరికపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఓవైపు టీడీపీ నేతలు దగ్గుబాటి ఊసరవెల్లికి తాత అంటూ విమర్శిస్తుంటే… వైసీపీ నేతల్లో కూడా అసంతృప్తి నెలకొన్నది.
ముఖ్యంగా ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. దగ్గుబాటి సొంత నియోజకవర్గం పర్చూరు కావడంతో.. అక్కడి నుంచి తన కొడుకును పోటీ చేయించాలని చూస్తున్నాడు. దగ్గుబాటి కూడా పలుమార్లు అక్కడి నుంచి గెలవడంతో తనకు బలమున్న నియోజకవర్గం నుంచి తన కొడుకును పోటీ చేయించాలనుకోవడంతో స్థానిక వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దగ్గుబాటి తమ కొంప ముంచేలా ఉన్నాడని… సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్థానిక నేతల పరిస్థితి ఏంది అంటూ దగ్గుబాటిపై కోపంతో ఉన్నట్టు సమాచారం.
ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లకు అన్యాయం చేయకుండా చూడాలంటూ… పర్చూరు వైసీపీ నేతలంతా జగన్ ను కోరుతున్నారు. దగ్గుబాటి కొడుకుకు గానీ.. దగ్గుబాటికి గానీ టికెట్ ఇవ్వకూడదని… పార్టీ కోసం పని చేస్తున్న వాళ్లకే టికెట్ కేటాయించాలంటూ జగన్ తో మొర పెట్టుకున్నట్టు సమాచారం. దగ్గుబాటి తన కొడుకుతో హితేశ్ తో కలిసి వైసీపీలో చేరుతుండగా… దగ్గుబాటి భార్య, ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉండనున్నారు.