వైరల్ గా మారిన రష్మిక మందన్న అండర్ వాటర్ ఫోటోషూట్..

-

రష్మిక మందన్న.. అనే కన్నా గీత అంటే అందరికీ వెంటనే తెలిసిపోతుంది. గీత గోవిందం స్టార్ రష్మిక మందన్న.. ఒకే ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ సుందరి చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం తన సినీ కెరీర్ రైట్ ట్రాక్ లోనే నడుస్తున్నది.

తన సినీ కెరీర్ తో పాటు కాసింత పర్యావరణంపై అవగాహన ఉంది రష్మికాకు. అందుకే.. పర్యావరణాన్ని కాపాడటానికి తనకు చేతనైనంత చేస్తుంటుంది రష్మిక. ఆ ఉద్దేశంతోనే ఇటీవల కర్ణాటకలోని బెళ్లందూర్ లో ఉన్న చెరువలో అండర్ వాటర్ ఫోటోషూట్ చేసింది. నీటి కాలుష్యం ఎలా జరుగుతున్నదో కళ్లకు కట్టినట్టు చూపించింది రష్మిక. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోతో పాటు.. రష్మికాకు సంబంధించిన మరికొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version