భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 94వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 స్మారక నాణేన్ని విడుదల చేసింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం విడుదల చేశారు.ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో భాజపా సన్నిహితుడు ఎల్‌కే అడ్వాణీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… దేశానికి వాజ్ పేయీ చేసిన గుర్తు చేస్తూ..ఆయన లేరు అని నమ్మడానికి తన మనసు అంగీకరించడం లేదని పేర్కొంటు మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల మదిలో ఆయన స్థానమేంటో చెప్పేందుకు ఇదొక ప్రక్రియ అంటూ పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలపై ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు, భాజపాను అతిపెద్ద రాజకీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషిచేశారని వివరించారు. అధికారలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే …వారి కోసమే ఆయన ఆలోచించేవారని ఆయన పేర్కొన్నారు.