రోగిని చితకబాదిన డాక్టర్.. వైరల్ వీడియో

-

రోగిపై డాక్టర్ దాడి చేసిన ఈ వీడియో రాజస్థాన్ ప్రభుత్వానికి చేరడంతో… ఆ ఘటనపై స్పందించిన రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ రఘు శర్మ… ఆ వీడియోపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

డాక్టర్ ను దేవుడితో పోల్చుతారు. ఎందుకు.. దేవుడిలా డాక్టర్ ప్రాణం పోస్తాడు కాబట్టి. ప్రాణాలను నిలబెడతాడు కాబట్టి. కానీ.. ఈ డాక్టర్ ను చూస్తే మాత్రం డాక్టర్లపై మీకు ఉన్న ఆలోచనా విధానమే మారిపోతుంది. ఓ డాక్టర్ ఓ రోగిని చితకబాదాడు. రెండు చెంపలు వాయించాడు. రోగి బెడ్ మీదికి వెళ్లినా బెడ్ ఎక్కి మళ్లీ చెంపలపై తీవ్రంగా కొట్టాడు ఆ డాక్టర్.

డాక్టర్ కొడుతుంటే ఆ రోగి తన కాళ్లతో అతడిని నిలువరించే ప్రయత్నం చేయగా… డ్యూటీలో ఉన్న మరో డాక్టర్ అతడి కాళ్లను పట్టుకున్నాడు. మూడు నాలుగు సార్లు ఆ డాక్టర్.. రోగిపై దాడికి దిగి.. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న సవాయ్ మాన్ సింగ్(ఎస్ఎమ్ఎస్) మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్నది.

అయితే.. ఆ డాక్టర్ రోగిపై దాడి చేస్తుండగా అక్కడే ఉన్న ఇతర డాక్టర్లు కానీ.. ఇతర రోగులు కానీ ఆ డాక్టర్ ను నిలువరించే ప్రయత్నం చేయలేదు. అసలు.. ఆ డాక్టర్ రోగిపై ఎందుకు దాడి చేశాడు.. అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

అయితే.. డాక్టర్ రోగిపై దాడి చేస్తుండగా ఎవరో పేషెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోగిపై డాక్టర్ దాడి చేసిన ఈ వీడియో రాజస్థాన్ ప్రభుత్వానికి చేరడంతో… ఆ ఘటనపై స్పందించిన రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ రఘు శర్మ… ఆ వీడియోపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ డాక్టర్ రోగిపై ఎందుకు దాడి చేశాడో వివరాలు తెలుసుకున్నాక ఖచ్చితంగా ఆ డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని మినిస్టర్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version