ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన బిర్యానీ.. ధ‌ర ఎంతో తెలిస్తే షాక‌వుతారు..!

-

మ‌న‌లో అధిక శాతం మంది బిర్యానీ ప్రియులు ఉంటారు. ఎప్పుడో ఒక సారి బిర్యానీని తినేవారు కొంద‌రుంటే ఆ రుచికి ఫిదా అయి త‌ర‌చూ బిర్యానీ తినేవారు కొంద‌రుంటారు. అయితే బిర్యానీ ఖ‌రీదు మ‌హా అయితే ఎంత ఉంటుంది ? పేరుగాంచిన రెస్టారెంట్ల‌లో అయితే రూ.250 మొద‌లుకొని రూ.350 వ‌రకు ఉంటుంది. చికెన్‌, మ‌ట‌న్ బిర్యానీల‌కు ధ‌రల్లో వ్య‌త్యాసం ఉంటుంది. అయితే దుబాయ్‌లో ఆ రెస్టారెంట్ వారు అందిస్తున్న బిర్యానీ మాత్రం చాలా ఖ‌రీదైంది.

దుబాయ్‌లోని బాంబే బారో హోట‌ల్ వారు త‌మ మొద‌టి యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా అక్క‌డ స్పెష‌ల్ బిర్యానీని త‌యారు చేసి అందిస్తున్నారు. అయితే ఆ బిర్యానీలో పైన గార్నిష్ కోసం 23 క్యారెట్ల బంగారాన్ని వాడారు. అందుక‌ని ఆ బిర్యానీ చాలా ఖ‌రీదు అయింది. దాని ధ‌ర 1000 దిర్హామ్‌లు. మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.20వేలు. అవును నిజ‌మే. ఇక ఆ బిర్యానీని 5-6 మంది సుల‌భంగా తిన‌వ‌చ్చు. అందులో బిర్యానీతోపాటు కాశ్మీరీ ల్యాంబ్ సీక్ క‌బాబ్‌, ఓల్డ్ ఢిల్లీ ల్యాంబ్ చాప్స్‌, రాజ్‌పూత్ చికెన్ క‌బాబ్‌, మొగ‌ల్ కోఫ్తా, మ‌ల‌య్ చికెన్‌ల‌ను కూడా అందిస్తారు. ఇక ఆ బిర్యానీకి హోట‌ల్ వారు రాయ‌ల్ గోల్డ్ బిర్యానీగా పేరు పెట్టి అందిస్తున్నారు.

అయితే దుబాయ్‌లోనే పొన్నుస్వామి రెస్టారెంట్ అని ఇంకో ఇండియ‌న్ రెస్టారెంట్ ఉంది. అందులో బాహుబ‌లి థాలిని వ‌డ్డిస్తారు. థాలి అంటే మీల్స్ అన్న‌మాట‌. అందులో అనేక ర‌కాల డిషెస్ ఉంటాయి. చేప‌ల వేపుడు, రొయ్య‌ల వేపుడు, తందూరి చికెన్‌, పుట్ట గొడుగుల ఫ్రై, బ్రెడ్‌, ప‌రోటా, రైస్, ర‌సం, సాంబార్‌, స్వీట్లు ఆ మీల్స్‌లో ఉంటాయి. ఆ మీల్స్ ఖ‌రీదు 135 దిర్హామ్‌లు. అంటే మ‌న క‌రెన్సీలో రూ.2690 అన్న‌మాట‌. దుబాయ్ వెళ్లిన‌ప్పుడు మీకు శ‌క్తి ఉంటే ఆ బిర్యానీ, ఈ మీల్స్ ను ఒక‌సారి తిని చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version