వధూవరుల కోసం ‘సంస్కారీ’ కోర్సును ప్రారంభించిన యూనివర్సిటీ!

-

మామూలుగా యూనివర్సిటీలకు ఎందుకు వెళ్తాం. ఒక విద్యార్థిగా ఉన్నత విద్యలు చదువుకుంటాం అక్కడ. అవి జాబ్ వెతుక్కోవడానికి పనికొస్తాయి. భవిష్యత్తులోనూ ఆ సర్టిఫికెట్లు ఉపయోగపడుతాయి. మరి.. కాబోయే వధూవరులు కూడా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న బర్కతుల్లా యూనివర్సిటీకి క్యూ కడుతున్నారు. ఎందుకంటారు?

ఎందుకంటే.. ఆ యూనివర్సిటీ వాళ్లు కొత్తగా పెళ్లయ్యే వధూవరులకు కోర్సును నేర్పిస్తారట. అంటే.. అంటే గింటే ఏం లేదు. పెళ్లయ్యాక జీవితం ఎలా ఉంటుంది. ఎలా ఉండాలి. తన భర్త లేదా భార్యతో ఎలా మెలగాలి. ఎటువంటి సమస్యలు, గొడవలు లేకుండా జీవితాన్ని ఎలా నెట్టుకురావాలి. కలిసి మెలిసి ఎలా బతకాలి.. ఇలా భార్యాభర్త కలిసి జీవించడానికి అవసరమైనవన్నీ అక్కడ నేర్పిస్తారట. వావ్.. కొత్తగా ఉందే ఈ కాన్సెప్ట్ అంటారా? అవును.. కొత్తదే. దానికి ఓ పేరు కూడా పెట్టారు. సంస్కారీ కోర్సు దాని పేరు. మూడు నెలలు ఉంటుంది. వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నది. విజయవంతంగా కోర్సును పూర్తి చేసుకున్నవాళ్లకు సర్టిఫికెట్ కూడా ఇస్తారట.

ముందుగా మాత్రం 30 మంది అమ్మాయిలతో ప్రారంభిస్తున్నారట ఈ కోర్సును. తర్వాత అబ్బాయిలకు కూడా. అయితే.. ఈ సరికొత్త కోర్సుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు యూనివర్సిటీపై తెగ ఫైర్ అవుతున్నారు. ముందు సక్కగా చదువులు చెప్పండిరా నాయనా.. తర్వాత సంస్కారం అదే వస్తుంది అంటూ యూనివర్సిటీ అధికారులపై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version