టిక్‌ టాక్ :‌ ఇంట్లో దయ్యం? ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో…!

-

కరోనా లాక్ డౌన్ నుంచి సోషల్ మీడియాలో జనం ఎక్కువగా గడుపుతున్నారు. ప్రతీ ఒక్కరు కూడా సోషల్ మీడియాలో సమయం గడుపుతూ కొత్త అనుభూతులు అక్కడే పొందుతున్నారు. ప్రతీ వీడియో ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. తాజాగా ఒక వీడియో వైరల్ వీడియో ఇప్పుడు జనాలకు ఆసక్తికరంగా మారింది. ఆ వీడియో లో ఉన్న జీవి ఏంటో ఎవరికి అర్ధం కాలేదు.

టిక్ టాక్ యూజర్ ఒకరు డాన్స్ వీడియో ని రికార్డ్ చేసి పోస్ట్ చేసారు. టిక్ టాక్ యూజర్ పేరు. రూబిక్స్_క్యూబ్ (అకా రూబెన్) రెండు రోజుల క్రితం డోజా క్యాట్స్ సే సో అనే పాటకు డాన్స్ చేస్తూ వీడియో పోస్ట్ చేసారు. డ్యాన్స్ రికార్డ్ చేసేటప్పుడు తాను ఒంటరిగా ఇంట్లో ఉన్నానని అతను కామెంట్ చేసి పోస్ట్ చేసాడు. అయితే అతను పోస్ట్ చేసిన వీడియోలో వాస్తవం మాత్రం మరో విధంగా ఉంది. అతను ఒంటరిగా డ్యాన్స్ చేస్తున్నట్లు మాములుగా కనపడుతుంది.

కాని అక్కడ డాన్స్ కి బదులు ఒక జీవి వచ్చి మాయమవుతుంది. అతను డాన్స్ చేసే వెనుక మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీద ఏదో కనపడింది. అది కోతి అని కొందరు అంటే కుక్క పిల్ల అని కొందరు అన్నారు. ఈ వీడియో ని ఇప్పటి వరకు 8 మిలియన్ల మంది చూసారు. అయితే కొందరు దెయ్యం అంటే మరికొందరు దొంగ అని కూడా అంటున్నారు. అసలు ఇది ఏమైనా ఎడిట్ చేసిన వీడియోనా అనేది అర్ధం కావడం లేదు. అతని ఇంట్లో పెంపుడు జంతువులు ఏమీ లేవని తాను స్మశానం దగ్గర ఇంట్లో ఉన్నా అని అన్నాడు.

@reubix_cubelmao i’m home alone so i learned a tiktok dance. lov u doja but what has my life come to? ##musiclives ##positivevibes ##sayso ##qurantine ##boredathome♬ Say So – Doja Cat

Read more RELATED
Recommended to you

Latest news