చైనా వద్దన్నా వెళ్లి అంతు చూస్తాం; ట్రంప్

-

కరోనా ఏమో గాని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. రోజు రోజుకి ఆయన విమర్శల తీవ్రతను పెంచుతున్నారు. అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నా సరే ట్రంప్ మాత్రం మారడం లేదు. చైనా అంతు చూస్తాం అని ప్రకటించిన ట్రంప్… తాజాగా మరిన్ని వ్యాఖ్యలు చేసారు. అసలు చైనాలో ఎం జరుగుతుందో తెలుసుకోవడానికి బృందాన్ని చైనా వద్దన్నా పంపిస్తామని అన్నారు.

‘‘చైనాలోకి వస్తామని చాలా కాలం క్రితమే మేం వారిని కోరామని… మమ్మల్ని వారు ఆహ్వానించనప్పటికీ.. మేం వెళ్లాలనే అనుకుంటున్నామన్నారు ట్రంప్. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందం వరకు పరిస్థితులు సుహృద్భావంగానే ఉన్నాయని వ్యాఖ్యానించిన ట్రంప్… కానీ, ఒక్కసారిగా ఈ వైరస్‌ వెలుగులోకి రావడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయన్నారు.

చైనా కరోన వైరస్ ని కావాలని తయారు చేసింది అనేది ట్రంప్ అభిప్రాయం. ఈ వైరస్ ని చైనా దాచిపెట్టి ఇప్పుడు విడుదల చేసింది అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. చైనా మీద అన్ని దేశాలు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ దేశం కావాలనే తయారు చేసిందని అన్ని దేశాలు ట్రంప్ తో గొంతు కలుపుతున్నాయి. అటు యురోపియన్ దేశాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news