లోక్ సభ ఎన్నికలు: ఈవీఎంలో పాము… ఆగిపోయిన పోలింగ్

-

మూడో దశలో భాగంగా జరుగుతున్న ఎన్నికల్లో కన్నూర్ లోక్ సభ స్థానానికి లెఫ్ట్ పార్టీ తరుపున పీకే శ్రీమతి, కాంగ్రెస్ నుంచి సుదీంద్రన్, బీజేపీ నుంచి పద్మనాభన్ పోటీ చేస్తున్నారు.

ఇవాళ లోక్ సభ మూడో దశ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా నడుస్తోంది. అయితే.. ఓ పోలింగ్ కేంద్రంలో మాత్రం ఈవీఎంలో పాము ప్రత్యక్షమైంది. ఈ ఘటనతో పోలింగ్ సిబ్బందితో పాటు ఓటేయడానికి వచ్చిన ఓటర్లు కూడా షాక్ అయ్యారు.

కొద్దిసేపు ఓటింగ్ ను నిలిపేసి… ఈవీఎంకు అనుబంధంగా ఉన్న వీవీప్యాట్ బాక్స్ లో దాగిన పామను బయటికి తీశారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్నది. మయ్యిల్ కందక్కయ్ లో పోలింగ్ జరుగుతుండగా… వీవీప్యాట్ లో పాము దూరిందనే ప్రచారం సాగింది. దీంతో పామును తొలగించిన అనంతరం పోలింగ్ ను మళ్లీ కొనసాగించారు.

అయితే.. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ వీవీప్యాట్ లో ఎటువంటి పాము దూరలేదని.. అది పోలింగ్ బూత్ లో దూరిన పామని తెలిపారు. ఆ పామును వెంటనే అక్కడి నుంచి తీసేశామని.. పోలింగ్ మళ్లీ పున:ప్రారంభమైందని తెలిపారు.

మూడో దశలో భాగంగా జరుగుతున్న ఎన్నికల్లో కన్నూర్ లోక్ సభ స్థానానికి లెఫ్ట్ పార్టీ తరుపున పీకే శ్రీమతి, కాంగ్రెస్ నుంచి సుదీంద్రన్, బీజేపీ నుంచి పద్మనాభన్ పోటీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version