ఎన్నికలు ముగిశాక… అమర్ నాథ్, ఆయన ఫ్రెండ్స్ కలిసి శ్రీలంక టూర్ కు వెళ్లారు. ఆయన బస చేసిన కింగ్స్ జ్యూరీ హోటల్ కు అత్యంత సమీపంలోనే బాంబులు పేలాయి.
ఈస్టర్ డే రోజున శ్రీలంకలో జరిగిన మారణకాండ గురించి తెలిసిందే కదా. బాంబు పేలుళ్లలో 300 మందికి పైగా మృతి చెందారు. 500 మంది దాకా గాయపడ్డారు. చర్చీలు, స్టార్ హోటళ్లనే లక్ష్యంగా చేసుకొని పేలుళ్లు జరిపారు.
అయితే.. ఈ పేలుళ్ల నుంచి పలువురు భారతీయులు ప్రాణాలు దక్కించుకున్నారు. అందులో తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. అనంతపురానికి చెందిన కొందరు తృటిలో పేలుళ్ల నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. తాజాగా అనకాపల్లి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గుడివాడ అమర్ నాథ్ కూడా శ్రీలంక బాంబు పేలుళ్లను తప్పించుకున్నారట.
పేలుళ్ల సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. ఆయన, ఆయన స్నేహితులు పేలుళ్లను తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. ఎన్నికలు ముగిశాక… అమర్ నాథ్, ఆయన ఫ్రెండ్స్ కలిసి శ్రీలంక టూర్ కు వెళ్లారు. ఆయన బస చేసిన కింగ్స్ జ్యూరీ హోటల్ కు అత్యంత సమీపంలోనే బాంబులు పేలాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అమర్ నాథ్, ఆయన స్నేహితులు అక్కడి నుంచి బయటపడి.. వెంటనే వైజాగ్ కు చేరుకున్నారు. వైజాగ్ కు వచ్చిన తర్వాత… మీడియాతో మాట్లాడిన అమర్ నాథ్.. దేవుడి ఆశీస్సుల వల్ల, ప్రజల అభిమానం వల్లనే తాను బతికి బయటపడ్డానని అమర్ నాథ్ తెలిపారు.