వింత: తిమింగలంతో స్నేహం..!

-

సాధారణంగా పక్షులతో, జంతువుల తో చెలిమి చేస్తే చాలా బాగుంటుంది. కానీ వాటిని అలవాటు చేసుకోవడం మొదట్లో కాస్త ఇబ్బందులు పడినా ఆ తరువాత పూర్తిగా మనకి దగ్గర అయిపోతాయి. ఇలా ఒక అతను ఏకంగా తిమింగలం తోనే స్నేహం చేసాడు. ఇది నిజంగా జరిగినదే. అయితే అతను ఈ తిమిగలం తో ఇంత దగ్గరగా ఉండడం వెనుక ఓ కధే ఉంది. 2019లో నార్వే లోని హామర్‌ఫెస్ట్‌ లో శరీరం పై కెమెరా తగిలించి ఉన్న ఈ బెలూగా వేల్‌ కొంత మంది మత్స్యకారులకు కనిపించింది.

strange news
strange news

అయితే దీని మీద సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ పేరు ఉండటం తో రష్యా వాళ్లు పంపిన గూఢచారి తిమింగలం అని అనుకున్నారు. కానీ దీనికి ఎలాంటి రుజువు లేదు. అయితే ఈ తిమింగలం కి కెమెరా చుట్టి ఉండడం వలన ఇది చాల ఇబ్బంది పడిపోయింది. చాల మంది ఆ కెమెరాని దాని నుండి తీసేందుకు ప్రయత్నం చేసారు. కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ తిమింగలం తో స్నేహంగా ఉండే హెస్టెన్‌ దానిని తీసాడు.

అలా ధైర్యం చేసి ఇతను నీళ్ల లోకి దిగి.. ఆ చిక్కుని తీసేసాడు. అయితే అప్పటి నుండి ఫ్రండ్స్ అయి పోయారు. అప్పుడు కలిసిన ఓ ఫొటోగ్రాఫర్‌ ఈ చిత్రాన్ని తీసాడు. ఈ చిత్రం చాల అద్భుతంగా ఉండడం తో సోనీ వరల్డ్‌ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌ 2021 తుది జాబితాకు ఎంపికైన చిత్రాల్లో దీనికీ చోటు దక్కింది. దీనితో ఇలా స్నేహం కుదరడం వలన ఈ తిమింగలం ఒక సెలబ్రిటీ అయిపోయింది. దూర ప్రాంతాల నుండి దీనిని చూడడానికి పర్యాటకులు వస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news