ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారా..అయితే ఇది చదివాక వామ్మో అంటారు…!!!

174

ఫాస్ట్ ఫుడ్స్ ప్రస్తుత పరుగుల ఉరుకుల కాలంలో జనాలు వీటిపైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇంట్లో అన్నం వండుకుని తినే బదులు, బయట హోటళ్ళలో ఫాస్ట్ ఫుడ్ తింటూ గడిపేస్తున్నా కుటుంభాలు ఎన్నో ఉన్నాయి. అయితే శ్రమ తగ్గుతుంది, రుచి బాగుంటుంది కదా ఇవే బెటర్ అనుకునే అమాయక ప్రజానికానికి తాజాగా జరిగిన ఓ సంఘటన గుబులు పుట్టించక మానదు. కేవలం అతడు ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలన రెండు కళ్ళు పోగొట్టుకుని ఇప్పుడు అంధకారంలో బ్రతుకుతున్నాడు. 

అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో బ్రిస్టల్ కౌంటీ లో చెందిన 14 ఏళ్ళ వయసు ఉన్న పిల్లాడికి రోజు ఫాస్ట్ ఫుడ్స్ తిండం అలవాటుగా మారింది. ఎంతగా అలవాటు అంటే ఫస్ట్ ఫుడ్స్ మాత్రమే తన రోజు వారి ఫుడ్ మెనూ లో ఉండేది. మరే ఫ్రూట్స్, వెజిటబుల్స్ కి స్థానంలేదు తన మెనూ లో. ఇలా రోజు ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉంటున్న క్రమంలో ఓ రోజు బాగా అలసిపోయినట్టుగా ఉండటంతో ఆసుపత్రిలో చేరాడు.

అతడిని పరీక్షించిన డాక్టర్లు షాక్ అయ్యారు. ఎందుకంటే అతడి శరీరంలో ఎర్ర రక్త కణాలు సాధారణ పరిమాణంలో కంటే కూడా పెద్దవిగా ఉన్నాయి. విటమిన్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. అంతేకాదు ఎముకల బలం పూర్తిగా నశించి పోయింది. దాంతో అతడికి మాక్రోటిక్ అనీమియా అనే వ్యాధి వచ్చినట్లుగా గుర్తించారు. అంతేకాదు చూపు, వినికిడి కూడా అతడు కోల్పోయినట్టుగా వైద్యులు నిర్ధారించి తెలిపారు. ఈ ప్రభావం అతడు ఫాస్ట్ ఫుడ్స్ తనడంవలనే జరిగిందని నిర్ధారించారు.