ఇది అద్భుతం.. మహాద్భుతం. అంతకు మించి పదం ఏదైనా ఉంటే చెప్పుకోవాలి కాబోలు. తల్లి పుట్టిన గర్భసంచి నుంచే తన బిడ్డ కూడా పుట్టింది. ఇది నిజంగా మిరాకిలే. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకున్నది. గెలాక్సీ కేర్ హాస్పిటల్‌లో ఈ అద్భుతం జరిగింది. గుజరాత్‌కు చెందిన మీనాక్షికి 22 ఏళ్లు. ఆమెకు పుట్టుకతోనే గర్భసంచి లేదు. దీంతో ఆమె తల్లి అయ్యే అవకాశం లేదు. కానీ.. సరోగసి ద్వారా ఆమె తన పిల్లలను కనాలనుకోలేదు. దత్తతకు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. ఎలాగైనా తనే పిల్లలను కనాలనుకున్నది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన కడుపులో ఓ కాయను కాయించుకోవాలనుకున్నది. అందుకే.. తన తల్లి గర్భసంచిని తీసి తనకు అమర్చారు డాక్టర్లు. ఆపరేషన్ సక్సెస్ అయింది. గత సంవత్సరం మేలో ఈ ఆపరేషన్ జరిగింది. తర్వాత ఈ సంవత్సరం మార్చిలో మీనాక్షి కడుపు పండింది. గర్భం దాల్చింది. జాగ్రత్తగా 9 నెలల పాటు తన కడుపులోని బిడ్డను మోసిన మీనాక్షికి ఆపరేషన్ చేశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది మీనాక్షి. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని.. వాళ్లకు ఎటువంటి సమస్యా లేదని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలా తను పుట్టిన గర్భసంచి నుంచే తన బిడ్డను కని చరిత్ర సృష్టించింది ఆ తల్లి. వావ్.. సూపర్ కదా. తల్లీబిడ్డలు ఇద్దరు ఒకే గర్భసంచి నుంచి పుట్టడం అనేది ప్రపంచంలోనే మొదటి సారి అని డాక్టర్లు చెబుతున్నారు.
తల్లి పుట్టిన గర్భసంచి నుంచే బిడ్డ కూడా పుట్టింది..!
-