ఆ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్తే గంగాజ‌లం చ‌ల్లి చంద‌నం రాస్తారు.. ఎందుకంటే..?

-

పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసే బాధితులు కోపంగానో, ఆవేశంగానో, ఇత‌ర భావోద్వేగాల‌తోనో ఉంటారు. దీని వ‌ల్ల వారు కొన్ని సంద‌ర్భాల్లో త‌మ స‌మ‌స్య‌ను స‌రిగ్గా తెలియ‌జేయ‌లేక‌పోతుంటారు. అయితే పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చేవారు ప్ర‌శాంతంగా ఉండాల‌ని, త‌మ స‌మ‌స్య‌ల‌ను వారు పోలీసుల‌కు సావ‌ధానంగా తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో అక్క‌డి ఇన్‌స్పెక్ట‌ర్ వినూత్న ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

this sho in up offering gangajal and chandan to people

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లా నౌచందీ పోలీస్ స్టేష‌న్‌కు ఎవ‌రైనా వెళ్తే అక్క‌డ ఉండే స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్ ప్రేమ్ చంద్ శ‌ర్మ వారిపై ముందుగా గంగాజ‌లం చ‌ల్లుతాడు. త‌రువాత వారి నుదుటిపై చంద‌నం రాస్తాడు. అవును. అదేమీ ఆల‌యం కాదు. పోలీస్ స్టేష‌నే. అక్క‌డికి ఏ బాధితుడు అయినా వెళితే ముందుగా వారికి ఆ స‌ప‌ర్య‌లు జ‌రుగుతాయి. త‌రువాత పోలీసులు సావ‌ధానంగా బాధితుల ఫిర్యాదులను స్వీక‌రిస్తారు.

అయితే ఇలా ఎందుకు చేస్తున్నార‌ని అడిగితే.. సాధార‌ణంగా పోలీస్ స్టేష‌న్‌ల‌కు వ‌చ్చేవారు ఆవేశంతో, కోపంతో ఉంటారు. అందుక‌ని వారిపై గంగాజ‌లం చ‌ల్లి, వారి నుదుటిపై చంద‌నం రాస్తే వారు కొంత కూల్ అవుతార‌ని, ప్ర‌శాంతంగా మారుతార‌ని, దీంతో వారు త‌మ స‌మ‌స్య‌ల‌ను స‌రిగ్గా తెలియ‌జేస్తార‌ని, వాటికి ప్ర‌శాంతంగా ప‌రిష్కారం ఆలోచించ‌వ‌చ్చ‌ని, కేసుల‌ను ప్ర‌శాంతంగా సాల్వ్ చేయ‌వ‌చ్చ‌ని ప్రేమ్ చంద్ శ‌ర్మ తెలిపారు. కాగా పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న టేబుల్‌పై గంగాజ‌లం నిండిన బాటిల్స్ కూడా ఉండ‌డం విశేషం. మ‌రి దీనిపై ఉన్న‌తాధికారులు ఏమ‌ని స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news