సాగర్ బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత సహా 100 మంది టీఆర్ఎస్ లో చేరిక !

-

అనుకున్నట్టే జరిగింది. సరిగ్గా సాగర్ ఎన్నికల ముంగిట సాగర్ బీజేపీకి షాక్ తగిలింది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సమక్షంలో బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు 100 మంది అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ కండువా కప్పి అంజయ్య యాదవ్ ను పార్టీలోకి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఉప ఎన్నికల్లో కడారి బీజేపీ టికెట్ ఆశించగా చివరి నిమిషంలో రవి నాయక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో అంజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్‌లో చేరికపై అంజయ్యతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు  పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నిజానికి టీఆర్ఎస్ తమ పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటిస్తే ఆ తర్వాత అసంతృప్త నేతలను లాక్కుని వారిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావించింది. అయితే దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడికే టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. దీంతో  ఆ పార్టీ నుంచి ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ కీలక నేతను కోల్పోవాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news