తిరుపతి మెజార్టీ పై వైసీపీ మంత్రుల్లో కొత్త టెన్షన్

Join Our Community
follow manalokam on social media

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక రాజకీయపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే గెలుపు పై గట్టి ధీమాతో ఉన్న వైసీపీ ఇక్కడ వార్ వన్ సైడే అంటుంది. కనీసం నాలుగు లక్షల ఓట్ల మెజారిటీ సాధించాలని సీఎం జగన్ టార్గెట్ పెట్టడంతో బాధ్యతలు తీసుకోబోతున్న ఏడుగురు మంత్రులకు కొత్త టెన్షన్ పట్టుకుందట..ఆ స్థాయి మెజార్టీ కావాలంటే అదే స్థాయిలో ఓట్లు పోలవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారట వైసీపీ మంత్రులు.

తిరుపతి ఉప ఎన్నిక పై గెలుపు పై వైసీపీలో ధీమా కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థి ప్రకటనలో టిడిపి కంటే వైసీపీ కాస్త వెనుకబడినా ఫుల్ జోష్ తో గురుమూర్తిని సీన్ లో దింపి పక్కా ప్లాన్ తో వైసీపీ ముందుకెళ్తుంది.తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కలిపి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు కీలక మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.

తిరుపతికి పేర్ని నాని, శ్రీకాళహస్తికి గౌతమ్ రెడ్డి, సత్యవేడు కొడాలి నాని, సూళ్లూరు పేటకు కన్నబాబు, వెంకటగిరికి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లికి ఆదిమూలపు సురేష్, గూడూరుకు అనిల్ కుమార్ యాదవ్ లను ఇన్ ఛార్జ్ లుగా సీఎం జగన్ నియమించారు. ఓవరాల్ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి లకు కట్టబెట్టారు. కనీసం నాలుగు లక్షల మెజారిటీ తగ్గకుండా సాధించాలని సీఎం జగన్ మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

తిరుపతి పార్లమెంటు బరిలో సుమారు 16.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 13.20 లక్షల మంది ఓటేశారు. ఇందులో వైసీపీకి 7.22 లక్షల ఓట్లు రాగా, టీడీపీకి 4.94 లక్షల ఓట్లు వచ్చాయి. మొత్తంగా వైసీపీ సుమారు 2.28 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది. 80 శాతం పోలింగ్ నమోదైతేనే ఈ మెజార్టీ సాధ్యమైంది. ఇక 4 లక్షల మెజారిటీ సాధించాలంటే ఓటింగ్ శాతం భారీగా పెంచడంతో పాటు ఇతర పార్టీలకు ఓట్లు వెళ్లకుండా నిరోధించగలగాలి. ఇదే ఇప్పుడు వైసీపీ మంత్రులను ఎక్కువ టెన్షన్ పెడుతుందట.

జరిగేది ఉప ఎన్నికలు కావడంతో ఓటర్లు అంతే ఆసక్తితో పోలింగ్ బూత్ కి వస్తారా లేదా అనే సందేహాలు వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో సీన్లోకి దిగుతున్న మంత్రులు ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...