ఈ పులిని చూస్తే చెమటలు పట్టడం ఖాయం…!

-

జనాలు బయటకు రాకపోవడం అడవుల నుంచి అడవి జంతువులు బయటకు వస్తున్నాయి. ప్రతీ రోజు కూడా ఎక్కడో ఒక చోట అడవి జంతువుల అలజడి ఉంది. దీనితో ప్రజలు ఇళ్ళల్లో ఉండాలి అన్నా వ్యవసాయ పనులు చేసుకోవాలి అన్నా సరే భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఇటీవల ఒక పెద్ద పులి ప్రజలపై దాడి చేసింది. దీనితో ప్రజలు అందరూ కూడా గ్రామాన్ని వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది

అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని వ పులిని తిరిగి అడవిలోకి పంపడానికి నానా కష్టాలు పడ్డారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ఈ ఆపరేషన్ కి సంబంధించిన ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఫోటో ట్రాక్టర్ మీద కూర్చున్న పులి దాడి చేయడానికి ప్రయత్నం చేయగా ట్రాక్టర్ మీద ఉన్న వ్యక్తి దాని మీద పోరాటం చేస్తూ ఉంటాడు. .

“ఈ పులి ని పూర్తిగా చూడండి. ట్రాక్టర్ మీద కూర్చుని ఉన్న ఆ పులి వీడియో నిన్న వైరల్ అయ్యింది. అది ఒంటరిగా అడవి నుంచి బయటకు వచ్చిందని దాన్ని చాలా జాగ్రత్తగా అడవిలోకి పంపించారని ఆయన పేర్కొన్నారు. స్థానిక గ్రామస్థలు షూట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆ పులిని గనుక అడవిలోకి తోలకుండా ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news