వైరల్ వీడియో; ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే…!

-

మంగళవారం నాగపూర్ పోలీసులు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ట్రాఫిక్ రూల్స్ ప్రజలు పాటించని నేపధ్యంలో ట్రాఫిక్ నిభంధనల కోసం వాళ్ళు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ప్రజలను కోరడానికి నాగ్‌పూర్ నగర పోలీసులు ట్విట్టర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసారు. అయితే వారు చెప్పిన విధానమే ఆశ్చర్యంగా ఉంది.

“ముఖ్యమైనది: మీరు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే మీరు చెల్లించాల్సిన చలాన్ మొత్తం ఇది” అనే క్యాప్షన్‌తో నాగ్‌పూర్ సిటీ పోలీసులు వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోతో, మీరు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని నాగ్‌పూర్ పోలీసులు సలహా ఇవ్వడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ నియమాలను పాటించమని ప్రజలను ప్రోత్సహించడానికి ఇప్పుడు ఇది చాలా మంచి మార్గం అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

నెటిజన్లు వీడియోను ఆసక్తికరంగా మరియు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. కొంత మంది అయితే మ్యాన్ హోల్స్ బాగు చేసి అప్పుడు మాట్లాడండి అంటూ కామెంట్ చేయగా… అసలు ముగ్గురు పోలీసులు ఒక బండి మీద వెళ్తూ ఉంటారని వాళ్లకు ఎం ఫైన్ వేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ వీడియో చూసి పలువురు షాక్ అవుతున్నారు. ఎం చెప్పాలనుకున్నారు ఎం చెప్పారు అంటూ కామెంట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news