చైనాలోని కబేళా వద్ద చిత్రీకరించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఆవు తనను చంపవద్దని వేడుకుంటున్న వీడియోని డైలీ మెయిల్ పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే డైలీ మెయిల్ కథనం ప్రకారం, గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని శాంటౌలో ఆదివారం ఒక ఆవుని చంపడానికి గాను తీసుకొచ్చారు. దాని యజమాని దాన్ని అక్కడికి తీసుకొచ్చినప్పుడు అది లోపలి వెళ్ళడానికి ఇష్టపడలేదు.
వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే అది నడవడానికి ఇష్టపడలేదు. కన్నీళ్లు పెట్టుకుని తనను చంపవద్దని ఆ ఆవు వేడుకోవడం అక్కడ ఉన్న ఒక వ్యక్తి చిత్రీకరించాడు. దాని ముందు కాళ్ళపై మోకరిల్లి ముందుకి కదలకుండా అలాగే ఉండిపోతుంది. స్థానిక వార్తా సంస్థలు అది గర్భవతిగా ఉండవచ్చని అభిప్రాయపడ్డాయి. దీనితో అది బతకాలని బలంగా కోరుకుని ఉండవచ్చు అంటూ వ్యాఖ్యానించాయి.
“ఇది కబేళా వద్దకు వచ్చిన తరువా కసాయి దానిని ట్రక్కు నుండి దింపి లోపలకు దాన్ని చంపడానికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో అది మోకరిల్లి ఏడుస్తూనే ఉంది” అని లిన్ వాంగ్బో చైనీస్ న్యూస్ అవుట్లెట్ ది పేపర్ ప్రచురించింది. దాని బాధను అర్ధం చేసుకున్న ఆ వ్యక్తులు దాన్ని చంపకుండా వదిలేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కోట్ల కొద్దీ వ్యూస్ సాధించింది.
ఒక బృందం ఆవును సజీవంగా కొనడానికి 24,950 యువాన్లు (రూ .2.5 లక్షలు) వసూలు చేసింది. దానిని స్థానిక బౌద్ధ దేవాలయంలో అక్కడ ఆలయ నిర్వహణకు దానిని అప్పగించారు. ఆలయానికి దాని ఖర్చులను భరించటానికి దాతలు 4,000 యువాన్లను కూడా ఇచ్చారు.