వైరల్ వీడియో; ఇది కదా మానవత్వం అంటే…!

చైనాలో ప్రమాదానికి గురైన మహిళను రక్షించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సమయంలో సదరు మహిళను అక్కడ ఉన్న పాదచారులు రక్షించడం, ఆమెను బయటకు తీయడం వంటివి మానవత్వాన్ని చాటుతున్నాయి. గత వారం చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లోని లియుజౌ నగరంలో బిజీగా ఉన్న ఒక రహదారిపై,

ఎలక్ట్రిక్ బైక్ నడుపుతున్న ఒక మహిళ కారు కింద పడిపోయింది. దాని కింద చిక్కుకుని బయటకు రాలేక ఇబ్బంది పడుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆగిపోగానే డజన్ల కొద్దీ బాటసారులు ఆ కారుని పైకి ఎత్తి మహిళను బయటకు తీసుకురావడానికి చాలా వరకు కష్టపడ్డారు. యూట్యూబ్‌లో సిజిటిఎన్ ఈ వీడియో ని పోస్ట్ చేసింది. సిజిటిఎన్ కథనం ప్రకారం, 30 మందికి పైగా వ్యక్తులు,

కలిసి ఆ కారుని పైకి లేపడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసారు. కారుని జాగ్రత్తగా పైకి లేపి ఆమెను బయటకు తీసుకురావడానికి జాగ్రత్తగా కష్టపడ్డారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ, ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. గతంలో కూడా కొందరు వాహనదారులు ఇదే విధంగా భారీ వాహనాలను పైకి లేపి తూర్పు చైనాలోని సుకియాన్ నగరంలో ఒక మహిళను కాపాడారు.